AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: పెళ్లి కూతుళ్లను ఎత్తుకెళ్లే దెయ్యం.. ఓటీటీ ఆడియెన్స్‌ను వణికిస్తోన్న 270 కోట్ల హారర్ థ్రిల్లర్

కొన్ని రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఆడియెన్స్ ను బాగా భయపెట్టింది. బాక్సాఫీస్ వద్ద రూ. 270 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. ఇక గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ కు వణుకు పుట్టిస్తోంది.

OTT Movie: పెళ్లి కూతుళ్లను ఎత్తుకెళ్లే దెయ్యం.. ఓటీటీ ఆడియెన్స్‌ను వణికిస్తోన్న 270 కోట్ల హారర్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 14, 2026 | 2:02 PM

Share

గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓ హారర్ థ్రిల్లర్ సినిమా ఆడియెన్స్ ను తెగ భయపెడుతోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ రేపే సీన్స్, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. అంతకు ముందు థియేటర్లలోనూ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను భయపెడుతూనే బాక్సాఫీస్ వద్ద రూ.270 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది. కేవలం రూ. 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అలాగే ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఇక శుక్రవారం (జూన్ 12) ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంటోంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై భారీ వ్యూయర్ షిప్ అందుకుంటూ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా కథ మొత్తం ఒక పురాతన ప్యాలెస్ చుట్టూ తిరుగుతుంది. హీరోకు తన పూర్వీకుల నుంచి వారసత్వంగా ఈ పాత కోట వస్తుంది. అయితే ఈ కోట ఉన్న ఊరిని ఒక వింత శాపం వెంటాడుతుంటుంది. అదేంటంటే.. ఒక దుష్ట శక్తి అక్కడి పెళ్లికూతుళ్లను ఎత్తుకెళ్లిపోతుంటుంది. దెయ్యం భయంతో ఊరిలో ఎవరూ పెళ్లిళ్లు చేసుకోరు. కానీ ఈ విషయం తెలియని హీరో తన చెల్లెలికి అదే ఓల్డ్ ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తాడు. మరి పెళ్లి వేడుక కోసం ఆ కోటలోకి దిగిన హీరో, అతని కుటుంబీకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో తన పెళ్లిని జరిపించాడా? లేదా? అసలు ఆ దెయ్యం కథేంటి? ఆ దుష్ట శక్తిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా కథ.

బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ పేరు ‘భూత్ బంగ్లా’. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ మూవ భారీ వసూళ్లు రాబట్టింది. సుమారు రూ. 120 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 270 కోట్లు కలెక్ట్ చేసింది. తద్వారా 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అక్షయ్ కుమార్ తో పాటు ఈ చిత్రంలో పరేష్ రావల్, టబు, రాజ్‌పాల్ యాదవ్, వామికా గబ్బి, జిషు సేన్‌గుప్తా, అశ్రాని, మనోజ్ జోషి, మిథిలా పాల్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అక్షయ్ కుమార్, ఏక్తా కపూర్, శోభా కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన భూత్ బంగ్లా సినిమా జూన్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఓటీటీలో హారర్ కామెడీ చిత్రాలకు మంచి ఆదరణ, డిమాండ్ ఉంటోంది. అందుకు తగ్గట్టే భూత్ బంగ్లా సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో కూడా రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంటోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు