Nagarjuna: ఒకప్పుడు నాగ్ సూపర్ హిట్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన హీరోల్లో ఇతను కూడా ఒకరు. హీరో కాక ముందు కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. మరి కొన్ని సినిమాల్లో విలన్ గా చేశాడు. ఇంకొన్ని సినిమాల్లో సహాయక నటుడిగానూ చేశాడు.

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ప్రేమకథా చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలతో అనతికాలంలోనే స్టార్ హీరోగా అవతరించాడు. అలాగే అన్నమయ్య, శ్రీరామదాసు వంటి పౌరాణిక సినిమాల్లోనూ నటించి మెప్పించారీ అక్కినేని హీరో. ఇక ఆరు పదుల వయసులోనూ ఎంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు నాగ్. ఇప్పటికే తన సినిమాలతో ఎన్నో రికార్డులు అందుకున్న ఈ మన్మథుడు మరో మైలు రాయికి చేరువలో ఉన్నారు. అదే.. కింగ్ 100 సినిమా. ఓ తమిళ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కింగ్ కెరీర్ లో 100 వ సినిమా కాబట్టి దీని కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నాగ్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
ఇదిలా ఉంటే ఒకప్పుడు అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఒక వ్యక్తి ఆ తర్వాత కాలంలో నటుడిగా మారి ఆ తర్వాత స్టార్ హీరోగా కూడా ఎదిగిపోయాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున నటించి రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా. 1996లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అయితే ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమాకి మాస్ మహరాజా రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం విశేషం. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో చిన్న చితకా పాత్రలు, విలన్ రోల్స్ అలాగే సహాయక నటుడి పాత్రలు కూడా చేశారు రవితేజ. అందివచ్చిన అవకాశాలను చేతులారా సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు.
ఇరుముడి సినిమాలో రవితేజ..
View this post on Instagram
మాస్ మహరాజా రవితేజ చివరిగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో నటించారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు ఇరుముడి అనే ఓ డిఫరెంట్ సినిమాలో నటిస్తున్నారు రవితేజ. మజిలీ, నిన్నుకోరి వంటి క్లాసిక్స్ తీసిన శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
ఆగస్టు 21న గ్రాండ్ రిలీజ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




