AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Gold Price: అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

బంగారం కొనే వారికి ఇదొక గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్నాళ్లుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోల్చుకుంటే గురువారం ఉదయం 6గంటల వరకు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు కనిపించాయి. కాబట్టి గురువారం తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Today Gold Price: అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Today Gold Rate
Anand T
|

Updated on: Jun 18, 2026 | 6:38 AM

Share

బంగారం కొనే వారికి ఇదొక గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్నాళ్లుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోల్చుకుంటే గురువారం ఉదయం 6గంటల వరకు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు కనిపించాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 151,090 వద్ద కొనసాగుతుండగా బుధవారం ఈ ధర రూ.1,51,360గా ఉంది. అంటే నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ్టికి రూ.300 వరకు దిగొచ్చింది. ఇక 22 క్యారట్ల బంగారం ధర చూసుకుంటే దీనిపై కూడా రూ.200పైగా తగ్గి ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,38,490 వద్ద స్థిరపడింది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,64,900 వద్ద కొనసాగుతుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,51,090. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,38,490 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900గా ఉంది.
  • విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,51,090. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,38,490 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,51,090. 22 క్యారెట్ల ధర రూ.1,38,490 ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900 లుగా ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,51,090, 22 క్యారెట్ల ధర రూ.1,38,490 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900 లుగా ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,51,240. 22 క్యారెట్ల ధర రూ.1,36,640 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900 ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.153,050, 22 క్యారెట్ల ధర రూ.1,40,290 ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900 ఉంది.

కొనే ముందు ఇది గుర్తుంచుకోండి.. 

బంగారం, వెండి ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఎప్పటికప్పుడూ ఈ ధరలు మార్పు వస్తూ ఉంటాయి. కాబట్టి బంగారం కొనే ముందు  తాజాగా ధరలు తెలుసుకోండి. ఇందుకోసం ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

FAQ

  • ప్రశ్న: బంగారం ధరలు భవిష్యత్తులో ఇంకా తగ్గుతాయా?

  • జవాబు: అంతర్జాతీయ శాంతి పరిస్థితులు, డాలర్ బలాన్ని బట్టి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

  • ప్రశ్న: 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారానికి తేడా ఏమిటి?

  • జవాబు: 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం (నాణేలు/బిస్కెట్లు) అయితే, 22 క్యారెట్ ఆభరణాల తయారీకి వాడే బంగారం.

  • ప్రశ్న: నగరాల వారీగా బంగారం ధరలలో వ్యత్యాసం ఎందుకు ఉంటుంది?

  • జవాబు: స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు మరియు అక్కడి నగల సంఘాల నిర్ణయాల వల్ల ధరలు మారుతుంటాయి.

  • ప్రశ్న: బంగారం కొనేటప్పుడు మోసపోకుండా ఉండాలంటే ఏం చూడాలి?

  • జవాబు: నగపై ప్రభుత్వం గుర్తించిన ‘BIS హాల్‌మార్క్’ ముద్ర, ఆరు అంకెల HUID కోడ్ తప్పక చూసుకోవాలి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us