Thalliki Vandanam: విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!
ఏపీలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పాఠశాలల పునఃప్రారంభంతో రాష్ట్రంలో ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న తల్లికి వందనం పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో జరిగిన మీటింగ్‌లో జూన్ 3వ వారంలోపు ఈ పథకాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థులకు ఈ నెలాఖరులో విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది.

ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరులోపే తల్లికి వందనం పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఓపెన్ కావడంతో ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి త్వరితగతిన ఆర్థికసాయం అందేలా చూడాలని అధికారులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో మంత్రి లోకేష్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.
మంత్రి లోకేష్ ఉన్నతాధికారుల సమీక్ష
ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ సహా పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. వీటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం స్కూల్స్ రీఓపెన్ అవ్వడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై కూడా మంత్రి ఆరా తీశారు. ప్రభుత్వ స్కూళ్లలో చేరికల శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి:తల్లికి వందనం డబ్బులు మీకు వస్తాయో.. లేదా.. ఇంట్లోనే ఒక్క క్లిక్‌తో తెలుసుకోండిలా
జులై 3వ వారంలో అమల్లోకి తల్లికి వందనం!
అయితే తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి ప్రస్తుతం తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని.. ఇది పూర్తయిన వెంటనే జులై మూడో వారంలో పథకం అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ పథకం ద్వారా ప్రభుత్వం మొత్తం రూ.15వేలు అందించనుండగా అందులో రూ.13వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనుండగా.. మరో రూ.2వేలు విద్యార్థులు చదువుతున్న పాఠశాల ఖాతాలో జమ చేయనుంది.
FAQ
- ప్రశ్న: ‘తల్లికి వందనం’ పథకం కింద ఎంత ఆర్థిక సాయం అందుతుంది?
- జవాబు: ఈ పథకం కింద మొత్తం రూ.15,000 అందిస్తారు (తల్లి ఖాతాలో రూ.13,000, పాఠశాల ఖాతాలో రూ.2,000 జమ చేస్తారు)
- ప్రశ్న: ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది?
- జవాబు: తల్లుల ఆధార్ వెరిఫికేషన్ పూర్తికాగానే, జులై మూడో వారంలో ఈ పథకాన్ని అమలు చేసే ఛాన్స్ ఉంది.
- ప్రశ్న: ఈ పథకం డబ్బులు పడాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పని సరినా?
- జవాబు: అవును తల్లుల బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ అయి ఉంటేనే అకౌంట్‌లో డబ్బులు పడుతాయి
- ప్రశ్న : తల్లికి వందనం అర్హత చెక్ చేసుకోవడం ఎలా?
- జవాబు: ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ bm.sgsw.ap.gov.in లేదా gsws-nbm.ap.gov.in ద్వారా మీ వివరాలు ఎంటర్ చేసి తెలుసుకోండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
