10th Class : ఆ హీరో అంటే పడి చచ్చిపోతా.. ఆయన ప్రతి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తా.. 10th క్లాస్ హీరోయిన్..
తెలుగులో ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే హీరోయిన్లుగా మారిన తారలు చాలా మంది ఉన్నారు. అయితే అందులో కొందరు వరుస సినిమాలతో స్టార్ డమ్ అందుకోగా.. మరికొందరు ఒకటి రెండు చిత్రాలతోనే ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అందులో శరణ్య నాగ్ ఒకరు. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు. కానీ 10th క్లాస్ మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.

10th క్లాస్ సినిమాతో తెలుగులో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది శరణ్య నాగ్. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమైపోయింది. చాలా కాలంపాటు సైలెంట్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తన ఫ్యామిలీ గురించి, తన సినిమాల గురించి.. సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే తెలుగులో తనకు ఇష్టమైన హీరో గురించి చెప్పుకొచ్చింది. తనకు ప్రభాస్ అంటే పిచ్చి ఇష్టమని.. ఆయన సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో కచ్చితంగా చూస్తానని తెలిపింది. ప్రభాస్ సినిమాలంటే అపారమైన ప్రేమ, అభిమానం ఉన్నాయని చెప్పుకొచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ప్రభాస్ సార్ ఫోటోలు ఉండడం, స్నేహితులు తమిళ హీరోల గురించి అడిగితే, ప్రభాస్‌నే తన అభిమాన హీరోగా చెప్తానని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
తన 10వ తరగతిలో, ప్రభాస్ నటించిన “పౌర్ణమి” చిత్రం విడుదలైనప్పుడు, అందులోని “మువ్వలా నవ్వకలా” పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ పాటను ప్రతి ఆదివారం టీవీలో చూడడం, ప్రతి రోజు వినడం తనకు అలవాటని చెప్పుకొచ్చింది. “బాహుబలి” చిత్రం విడుదలైన తర్వాత, ప్రభాస్ పట్ల ఆమె అభిమానం మరింత పెరిగిందట. అదొక మలుపు అని శరణ్య చెబుతోంది. తమిళనాడులోని చెన్నైలో, ప్రభాస్ ప్రతి సినిమాను మొదటి రోజు, మొదటి ఆట చూడటంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది.
ఎక్కువమంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..
“బాహుబలి 1”, “బాహుబలి 2″తో సహా ఆయన నటించిన ప్రతి చిత్రానికి టిక్కెట్లు బుక్ చేసుకోవడంలో ఆమె అగ్రస్థానంలో ఉంటుంది. ప్రభాస్ పట్ల శరణ్యకున్న ఈ అంతులేని అభిమానం, ఆమెను ఒక ప్రత్యేకమైన అభిమానిగా నిలుపుతుంది. శరణ్య మిళంలో వచ్చిన ‘కాదల్’ (Kaadhal – 2004) చిత్రంలో కీలక పాత్రతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దాంతో ఆమెను ‘కాదల్ శరణ్య’ అని కూడా పిలుస్తారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..
శరణ్య, ప్రభాస్ ఫోటో..

Saranya, Prabhas
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..
