AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET PG అడ్మిట్ కార్డు విడుదల తేదీలో మార్పు.. మరికొన్ని గంటల్లోనే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

NEET PG 2026 అడ్మిట్ కార్డు విడుదల తేదీని NBEMS సవరించింది. తొలుత ఆగస్టు 27న అడ్మిట్ కార్డులు విడుదల చేయాలని నిర్ణయించగా.. తాజాగా ఆ తేదీని ముందుకు మార్చి ఆగస్టు 24, 2026న విడుదల చేయనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు ఈ కింది డైరెక్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో User ID, Passwordతో లాగిన్ అయి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

NEET PG అడ్మిట్ కార్డు విడుదల తేదీలో మార్పు.. మరికొన్ని గంటల్లోనే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
NEET PG Admit Card
Srilakshmi C
|

Updated on: Aug 24, 2026 | 3:04 PM

Share

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 24: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ (NEET PG) 2026 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు విడుదల తేదీలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) మార్పు చేసింది. తొలుత ఆగస్టు 27న అడ్మిట్ కార్డులు విడుదల చేయాలని నిర్ణయించగా.. తాజాగా ఆ తేదీని ముందుకు మార్చి ఆగస్టు 24, 2026న విడుదల చేయనున్నట్లు తెలిపింది. NEET PG 2026 పరీక్షను ఆగస్టు 30, 2026న నిర్వహించనున్నారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో ఒకే షిఫ్ట్‌లో పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డును అధికారిక NBEMS వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నీట్‌ పీజీ 2026 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

అభ్యర్థులు కింది విధానాన్ని అనుసరించి NEET PG 2026 హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఇవి కూడా చదవండి
  • ముందుగా NBEMS అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో NEET PG 2026 విభాగాన్ని ఓపెన్ చేయాలి.
  • అక్కడ కనిపించే Applicant Login/Admit Card లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థులు తమ User ID, Password వివరాలను నమోదు చేయాలి.
  • లాగిన్ వివరాలను సబ్మిట్ చేయాలి.
  • స్క్రీన్‌పై అడ్మిట్ కార్డు కనిపిస్తుంది.
  • అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్‌అవుట్ తీసుకుని భద్రంగా ఉంచుకోవాలి.

నీట్‌ పీజీ 2026 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

NEET PG 2026 ముఖ్యమైన తేదీలు ఇవే..

  • అడ్మిట్ కార్డు విడుదల తేదీ: ఆగస్టు 24, 2026.
  • NEET PG 2026 పరీక్ష తేదీ: ఆగస్టు 30, 2026.
  • ఫలితాల ప్రకటన తేదీ: సెప్టెంబర్ 30, 2026లోపు.
  • ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సిన గడువు: సెప్టెంబర్ 30, 2026.

అభ్యర్థులు అడ్మిట్ కార్డు విడుదలైన వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్షకు హాజరయ్యే ముందు అడ్మిట్ కార్డులోని పరీక్ష కేంద్రం, తేదీ, సమయం, వ్యక్తిగత వివరాలు, పరీక్షకు సంబంధించిన సూచనలు వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలి.

నీట్‌ పీజీ 2026 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us