Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు మీకు వస్తాయో.. లేదా.. ఇంట్లోనే ఒక్క క్లిక్‌తో తెలుసుకోండిలా
రాష్ట్రంలోని పేద విద్యార్థులకు అండగా నిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లి వందన అనే పథకాన్ని తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం స్కూల్స్ రీఓపెన్ అవుతున్న నేపథ్యంలో ఈ పథకం కింద రూ.15వేలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ పథకానికి మీరు అర్హులా కాదా అనేది తెలుసుకునేందుకు ప్రభుత్వం అన్‌లైన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మన అర్హతను ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తల్లికి వందనం అనే పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వ స్కూల్‌లలో చదివే అర్హులైన విద్యార్థులకు ఏడాకి రూ.15వేల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుంది. ఈ నిధుల్లో రూ.13 వేల విద్యార్థుల తల్లి ఖాతాలో నేరుగా జమ చేస్తుండగా.. మరో రూ.2వేలు స్కూల్ ఖాతాలో వేయనుంది.
అయితే వేసవి సెలవులు ముగిసి మల్లీ స్కూల్స్ ఓపెన్ అవ్వడంతో ఇప్పుడు విద్యార్థులకు ఈ నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకానికి మీరు అర్హులా కాదా అనేది తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవును లబ్ధిదారులు https://bm-sgsw.ap.gov.in/BM /Schemeout వెబ్ సైట్‌ను సందర్శించి మీరు అర్హులా కాదా అనేది తెలుసుకోవచ్చు. అదెలానో క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి.
అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా
- మొదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ bm.sgsw.ap.gov.in లేదా gsws-nbm.ap.gov.in ఓపెన్ చేయండి.
- తర్వాత హోమ్‌పేజీలో Scheme Eligibility లేదా Application Status ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు Scheme Name దగ్గర తల్లికి వందనం పథకాన్ని ఎంచుకోండి.
- ఇప్పుడు సంవత్సరం (Year) దగ్గర ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని సెలెక్ట్ చేయండి.
- లబ్ధిదారురాలైన తల్లి లేదా కుటుంబ పెద్ద ఆధార్ నంబర్‌ను అక్కడ ఎంటర్ చేయండి.
- స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, Get Details లేదా Submit పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది. ఆ OTP ని ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
- వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అక్కడ Validation Status లో Satisfied అని ఉంటే, మీరు ఈ పథకానికి అర్హులని అర్థం.
ఆఫ్‌లైన్‌లో ఇలా…
ఒకవేళ మీకు ఆన్‌లైన్‌లో చెక్ చేయడం వీలుపడకపోతే, మీ గ్రామంలోని గ్రామ , వార్డ్ సచివాలయానికి వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా లేదా మీ పిల్లలు చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి కూడా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




