AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamun: స్వీటే కానీ యమ డేంజర్.. నేరేడు పండు తిన్న తర్వాత ఇవి తింటే మీ బాడి షెడ్డుకే..

Never Eat These 5 Foods After Jamun: వర్షాకాలంలో విరివిగా దొరికే పళ్లలో నేరేడు పండ్లు కూడా ఒకటి. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికి. వీటిని ఎలా తింటున్నామనేది కూడా చాలా ముఖ్యం. అవును ఈ పండ్లు తిన్న వెంటనే కొన్ని ఆహారాలు తినడం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం, ఆరోగ్య నిపుణుల ప్రకారం, నేరేడు పండ్లు తిన్న తర్వాత తినకూడని ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Jun 12, 2026 | 8:57 PM

Share
పాల పదార్థాలు: వర్షకాలం స్టార్ట్ అయిదంటే చాలా నేరేడు పండ్లను తినేందుకు చాలా మంది ఇష్టంగా వేయిట్ చేస్తారు. కానీ ఈ పండు తిన్న వెంటనే పాలు తాగడం లేదా పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండులోని ఆమ్ల గుణాలు పాలతో కలిసినప్పుడు కడుపులో గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. కాబట్టి ఈ పండు తిన్న వెంటనే పాల పదార్థాల జోలికి వెళ్లకపోవడం మంచిది.

1 / 5
ఊరగాయలు: అలాగే ఈ పండ్లు తిన్న వెంటనే పుల్లగా ఉండే పచ్చల్లు తిన వద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ నేరేడు పండులో సహజంగానే పులుపు ఉంటుంది. ఈ క్రమంలో మళ్లీ పులుపు గుణాలు ఉన్న ఊరగాయలు తింటే కడుపులో యాసిడ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీనివల్ల తీవ్రమైన కడుపు మంట ఇతర సమస్యలు రావచ్చని సూచిస్తున్నారు.

2 / 5
నీళ్లు: చాలా మంది ఈ పండు తిన్న వెంటనే నీళ్లు తాగుతూ ఉంటారు. కానీ ఇది చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల  జీర్ణక్రియ మందగించి గ్యాస్, విరేచనాలు, లేదా కడుపునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి మీరు కనుక నేరేడు పండు తింటే.. దాదాపు 30 నుండి 40 నిమిషాల తర్వాతే నీళ్లు తాగండి.

3 / 5
స్పైసీ ఫుడ్స్: నేరేడు పండ్లు తిన్న తర్వాత ఎక్కవ కారంగా, మసాలాలతో కూడిన ఆహారం కూడా తీసుకోవడం మంచిది. కాదట. ఇలా ఎక్కువ స్పైసీగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడి, చర్మంపై అలర్జీలు లేదా దురదలు రావడానికి కారణం కావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ పండ్లు తిన్న వెంటనే కారంగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి.

4 / 5
చేదు ఆహారాలు: నేరేడు పండ్లు తిన్న తర్వాత కాకరకాయ లేదా చేదుగా ఉండే ఇతర ఏ కూరగాయలను తిన కూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి తినడం వల్ల శరీరంలో విషపూరిత రసాయన చర్యలు జరిగే ప్రమాదం ఉందని.. దీనివల్ల వాంతులు, తల తిరగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఈ సీజన్‌లో నేరేడు పండ్లు తినే ముందు ఇవి కచ్చితంగా గుర్తించుకోండి.

5 / 5
Follow Us