పెరుగు తింటే జలుబు, దగ్గు వస్తాయా? ఈ అపోహల వెనుక ఉన్న అసలు నిజం ఇదే!

25 July 2026

Rajashekher

పెరుగులో ప్రోబయోటిక్స్, ప్రోటీన్, కాల్షియం, మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు

పెరుగు తింటే జలుబు లేదా దగ్గు వస్తుందనే నమ్మకానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే చల్లటి పదార్థాలు పడని వారు గది ఉష్ణోగ్రతలో ఉన్న పెరుగును తీసుకోవడం మంచిది.

జలుబు, దగ్గుకు పెరుగు కారణం కాదు

శరీరానికి పడితే రాత్రిపూట పెరుగు తినడంలో ఎలాంటి సమస్య లేదు. అయితే రాత్రి భోజనాన్ని వీలైనంత త్వరగా, ముఖ్యంగా సాయంత్రం 7 గంటలలోపు ముగిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రిపూట కూడా పెరుగు తినవచ్చు

తాజాగా తయారయ్యే ఇంటి పెరుగులో ప్రిజర్వేటివ్స్ ఉండవు. అందుకే ప్యాకెట్ పెరుగు కంటే ఇంటి పెరుగు ఆరోగ్యకరమైన ఎంపికగా భావిస్తారు. 

ఇంట్లో తోడుపెట్టిన పెరుగే ఉత్తమం

సాధారణ ఆరోగ్యవంతులు ప్రతిరోజూ ఒక కప్పు సహజసిద్ధమైన పెరుగును ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. షుగర్ ఉన్నవారు కూడా తీపి కలపని పెరుగును నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవచ్చు

సాధారణ పెరుగు ఎసిడిటీ నుంచి ఉపశమనాన్ని ఇవ్వగలదు. అయితే మరీ పులిసిపోయిన పెరుగు తీసుకుంటే కొందరిలో ఎసిడిటీ లక్షణాలు కనిపించవచ్చు.

ఎసిడిటీ తగ్గించడంలో సహాయపడుతుంది

మధ్యాహ్న భోజనంతో పాటు పెరుగు తీసుకుంటే జీర్ణక్రియ మరింత మెరుగ్గా జరుగుతుంది. అందుకే ఇది పెరుగు తినడానికి అత్యంత అనుకూలమైన సమయంగా నిపుణులు చెబుతున్నారు.

మధ్యాహ్నం తినడం ఉత్తమం

చేపలు లేదా చికెన్‌తో పెరుగు తింటే చర్మవ్యాధులు వస్తాయనే నమ్మకానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేని వారు ఇతర ప్రోటీన్ ఆహారాలతో పాటు కూడా పెరుగును తీసుకోవచ్చు.

చేపలు, చికెన్‌తో కూడా తినవచ్చు