AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒరేయ్ ఆజామూ.. ఇదెక్కడి తలతిక్క నిర్ణయం రా.. 8 వికెట్లు తీసినోడిని ఇలా పక్కన పెట్టేశావ్ ఏంది..!

Pakistan vs West Indies 2nd Test: ఫామ్‌లో ఉన్న అబ్బాస్‌ను తుది జట్టు నుంచి తొలగించడం పాకిస్థాన్‌కు మేలు చేస్తుందో లేక కొంపముంచుతుందో రెండో టెస్టు ఫలితమే తేల్చనుంది. బాబర్ ఆజమ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం క్రీడా వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఒరేయ్ ఆజామూ.. ఇదెక్కడి తలతిక్క నిర్ణయం రా.. 8 వికెట్లు తీసినోడిని ఇలా పక్కన పెట్టేశావ్ ఏంది..!
Babar Azam
Venkata Chari
|

Updated on: Aug 03, 2026 | 8:15 AM

Share

Pakistan vs West Indies 2nd Test: పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. వెస్ట్ ఇండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్లు తీసి పాక్‌ను గెలిపించేందుకు పోరాడిన స్టార్ పేసర్ మహమ్మద్ అబ్బాస్‌ను జట్టు నుంచి తొలగించారు. కెప్టెన్ బాబర్ ఆజమ్ తీసుకున్న ఈ విచిత్రమైన నిర్ణయం పట్ల క్రికెట్ ప్రపంచం తీవ్ర విస్మయానికి గురవుతోంది.

వెస్ట్ ఇండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో మహమ్మద్ అబ్బాస్ అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు పడగొట్టి, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో విండీస్‌ను గడగడలాడించాడు. అంతటి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సీనియర్ బౌలర్‌పై తదుపరి మ్యాచ్‌లోనే వేటు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గెలిపించే సత్తా ఉన్న బౌలర్‌ను డ్రాప్ చేయడం వెనుక ఉన్న ఆలోచన ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.

పిచ్ పరిస్థితుల సాకు చూపి వదిలేశారు..

రెండో టెస్టు టాస్ సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ నిర్ణయంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. స్థానిక మైదాన పరిస్థితులు, పిచ్ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకునే అబ్బాస్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని చెప్పాడు. అతడి స్థానంలో యువ పేసర్ ఉబైద్ షాకు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చారు. వికెట్లు తీసి మంచి ఊపులో ఉన్న ప్రధాన బౌలర్‌ను పిచ్ సాకుతో పక్కన పెట్టడం పాక్ క్రికెట్ చరిత్రలోనే ఒక వింత నిర్ణయంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

తుది జట్టులో ఏకంగా నాలుగు మార్పులు..

కేవలం అబ్బాస్ మాత్రమే కాకుండా రెండో టెస్టు కోసం పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏకంగా నాలుగు మార్పులు చేసింది. వేలి గాయం కారణంగా సెంచరీ హీరో షాన్ మసూద్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా, అతడి స్థానంలో అబ్దుల్లా షఫీక్ జట్టులోకి వచ్చాడు. ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్ స్థానంలో అవైస్ జఫార్ అరంగేట్రం చేయగా, స్పిన్నర్ సజిద్ ఖాన్‌ను ఖుర్రం షెహజాద్ స్థానంలోకి తీసుకున్నారు.

అభిమానుల నుంచి విమర్శల పరంపర..

వికెట్లు తీసిన ఆటగాడికి రివార్డ్ ఇవ్వాల్సింది పోయి జట్టు నుంచి తీసివేయడంపై పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడుతున్నారు. కెప్టెన్ బాబర్ ఆజమ్ మైండ్ గేమ్స్, నిర్ణయాల వల్ల జట్టు స్థిరత్వం దెబ్బతింటోందని విమర్శిస్తున్నారు. ఫామ్‌లో ఉన్న బౌలర్‌ను పక్కన పెట్టి టెస్టు గెలవడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us