AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Redmi Turbo 5: ఐఫోన్‌ లుక్‌తో రెడ్‌మీ నుంచి కాంప్యాక్ట్‌ ఫోన్‌..ఫీచర్స్‌ చూస్తే మతిపోవాల్సందే!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మి భారత మార్కెట్లోకి మరో సరికొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే చైనాలో రిలీజై మంచి సేల్స్ సాధించిన Redmi Turbo 5 మోడల్‌ను ఇప్పుడు రెడ్‌మీ ఇండియాలో కూడా లాంఛ్ చేసింది. ఈ ఫోన్‌ ఫీచర్స్ ఏంటి.. దీని ధర ఎంత అనే పూర్తి వివరాల గురించి ఇక్కడ తెలుసుకోండి

Redmi Turbo 5: ఐఫోన్‌ లుక్‌తో రెడ్‌మీ నుంచి కాంప్యాక్ట్‌ ఫోన్‌..ఫీచర్స్‌ చూస్తే మతిపోవాల్సందే!
Redmi Turbo 5 India
Anand T
|

Updated on: Jun 17, 2026 | 1:26 PM

Share

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మి భారత మార్కెట్లోకి మరో సరికొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో విడుదలై మంచి విజయం సాధించిన Redmi Turbo 5 ఇప్పుడు అధికారికంగా భారతదేశంలో లాంచ్ అయింది. కాంపాక్ట్ బాడీతో పాటు ఏకంగా 7,540mAh భారీ బ్యాటరీతో పవర్‌హౌస్‌గా ఈ ఫోన్‌ మంచి ఫీడ్‌ బ్యాక్‌ను సొంత చేసుకుంది. అయితే బ్యాటరీ ఒక్కటే కాదు ఈ ఫోన్‌లో ఉన్న అల్ట్రా-ఫాస్ట్ ప్రాసెసర్‌ కూడా ఈ ఫోన్‌కు మంచి రివ్యూస్‌ను తెచ్చి పెడుతున్నాయి. కాబట్టి ఈ ఫోన్‌లో పూర్తి ఫీచర్స్‌ ఏంటో చూద్దాం.

డిస్‌ప్లే, డిజైన్: రెడ్‌మీ తీసుకొచ్చిన రెడ్‌మీ టర్బో-5 స్మార్ట్‌ ఫోన్‌లో 6.59-అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే తో పాటు120Hz ఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే ఈ ఫోన్‌టో 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ ఎండలో కూడా స్క్రీన్ మనకు స్పష్టంగా కనిపించేందుకు సహాయపడుతుంది. అంతే కాదు 1.5k రిజల్యూషన్‌లో వస్తున్న ఈ డిప్లే మూవీస్ చూసే వారికి కూడా బెస్ట్‌గా ఉంటుంది.

డిజైన్: ఇక డిజైన్‌ పరంగా చూసుకుంటే మెటల్ ఫ్రేమ్, కెమెరా మాడ్యూల్ లోపల ఆకర్షణీయమైన RGB రింగ్ లైట్లు తీసుకొచ్చారు. అంతేకాదు మిగతా ఫోన్‌లతో పోల్చుకుంటే ఇది చాలా స్టైలిష్ అండ్ స్లిమ్‌గా కనిపిస్తోంది. చేతిలో పట్టుకోవడానికి వీలుండే కాంప్యాక్ట్‌ సైజ్‌లో ఈ ఫోన్‌ను తీసుకోచ్చారు.

కెమెరా విశేషాలు: ఈ ఫోన్‌లోని కెమెరాల గురించి మాట్లాడుకుంటే.. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో అద్భుతమైన కెమెరా సెటప్‌ను తీసుకొచ్చారు. ఇందులో మొత్తం మూడు కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా: 50MP Sony IMX882 ప్రైమరీ సెన్సార్,8MP అల్ట్రా-వైడ్ కెమెరా , సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP కెమెరా ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

పర్ఫార్మెన్స్ : ఇక ఫర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 8500-Ultra చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గేమ్స్ ఆడే వారికి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే గేమింగ్, హెవీ మల్టీ టాస్కింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో 5,300 mm² వేపర్ ఛాంబర్‌తో కూడిన ‘3D ఐస్-లూప్ కూలింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. దీంతో గేమ్స్ అడే సమయంలో య్యాంగ్ అవ్వడం, వేడెక్కడం అనే ప్రాబ్లమ్స్ ఉండవు.

బ్యాటరీ, ఛార్జింగ్: ఈ ఫోన్‌లో ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇది 7,540mAh భారీ బ్యాటరీ, 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తోంది. దీనితో పాటు, ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా ఇందులో తీసుకొచ్చారు. ఇది మీకు జస్ట్‌ 30-45 మినెట్స్‌లో ఫుల్‌ చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు నార్మల్‌ యూజర్ అయితే 1 పుల్‌ డే వాడిని చార్జింగ్ అయిపోదు.

సాఫ్ట్‌వేర్, ఇతర ఫీచర్లు: ఈ ఫోన్ మనకు Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో HyperOS 3 మీద రన్‌అవుతుంది. దీనికి 4 సంవత్సరాల వరకు మేజర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇవ్వనున్నారు. అలాగే వాటర్, దుమ్ము, నుండి రక్షణ కోసం IP69K రేటింగ్‌ను కూడా ఇందులో తీసుకొచ్చారు. అలాగే ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఇన్‌ఫ్రారెడ్ (IR) సెన్సార్, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఇక మెమరీ విషయానికి వస్తే, ఇందులో గరిష్టంగా 12GB LPDDR5X RAM, 256GB UFS 4.1 స్టోరేజ్ లభిస్తుంది.

ధరలు, కలర్స్: Redmi Turbo 5 ఫోన్ మనకు Asphalt Black, Nitro Blue, Turbo White కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. అలాగే ఇది రెండు వేరియంట్లలో కస్టమర్స్‌కు అందుబాటులో ఉంటుంది. 8GB + 256GB దీని ధర రూ. 37,999 వరకు ఉండొచ్చని.. అలాగే 12GB + 256GB వేరియంట్ ధర రూ. 40,999 వరకు ఉండొచ్చని కంపెనీ చెబుతోంది. ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 19న నుంచి అందుబాటులోకి రానుంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రెడ్‌మీ నుంచి అదిరిపోయే లుక్‌తో కాంప్యాక్ట్‌ ఫోన్‌..
రెడ్‌మీ నుంచి అదిరిపోయే లుక్‌తో కాంప్యాక్ట్‌ ఫోన్‌..
మీ సక్సెస్‌కు అడ్డుగా నిలిచే అతిపెద్ద శత్రువు ఇదే..
మీ సక్సెస్‌కు అడ్డుగా నిలిచే అతిపెద్ద శత్రువు ఇదే..
భర్త ఇంటి నుంచి బయలుదేరగానే భార్యలు చేయకూడని 7 పనులు.. లేదంటే..
భర్త ఇంటి నుంచి బయలుదేరగానే భార్యలు చేయకూడని 7 పనులు.. లేదంటే..
శివసేనలో మరో చీలిక?.. థాకరే క్యాంప్‌లో కలకలం!
శివసేనలో మరో చీలిక?.. థాకరే క్యాంప్‌లో కలకలం!
వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్
వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్
సీబీఎస్సీ 10వ తరగతి సెకండ్‌ బోర్డు ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
సీబీఎస్సీ 10వ తరగతి సెకండ్‌ బోర్డు ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
పీఎఫ్ వడ్డీ అకౌంట్లలోకి ఎప్పుడంటే..? కేంద్రం క్లారిటీ
పీఎఫ్ వడ్డీ అకౌంట్లలోకి ఎప్పుడంటే..? కేంద్రం క్లారిటీ
ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్రానికే ఆదర్శం: సీఎం రేవంత్
ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్రానికే ఆదర్శం: సీఎం రేవంత్
జగన్నాథుడి విగ్రహాలు ఎందుకు అసంపూర్ణంగా కనిపిస్తాయి? ఆశ్చర్యపరిచే
జగన్నాథుడి విగ్రహాలు ఎందుకు అసంపూర్ణంగా కనిపిస్తాయి? ఆశ్చర్యపరిచే
రాత్రిపూట కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకోవడానికి అసలు కారణాలు..
రాత్రిపూట కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకోవడానికి అసలు కారణాలు..