AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిగరెట్లే అతని టార్గెట్.. వరుస చోరీలతో పోలీసులకు దొంగ సవాల్

క్రిష్ణా తీరంలో సిగరెట్ల దొంగల కొత్త ట్రెండ్ మొదలైంది. చిన్నచిన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకుని, కేవలం సిగరెట్లను మాత్రమే దొంగలిస్తున్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో వారం రోజుల్లో రెండు ఇలాంటి చోరీలు జరిగాయి. ముప్పై వేల విలువైన సిగరెట్లు, కొంత నగదును అపహరించారు.

సిగరెట్లే అతని టార్గెట్..  వరుస చోరీలతో పోలీసులకు దొంగ సవాల్
Cigarette Thief
T Nagaraju
| Edited By: |

Updated on: Jun 17, 2026 | 9:54 PM

Share

క్రిష్ణా తీరంలో సరికొత్త దొంగలు బయలు దేరారు. చిన్న చిన్న దుకాణాలే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. వరుసగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇంతకీ వీరు ఏం దొంగలిస్తున్నారో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. వరుస దొంగతనాల్లో వీరు దొంగలించింది ఏంటంటే సిగరెట్లు.. నిజమే వీరు చదువుతుంది.. ఈ దొంగలు సిగరెట్లు నిల్వ ఉంచే దుకాణాలనే టార్గెట్ చేసి దోచుకుంటున్నారు.

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో వారం రోజుల వ్యవధిలో రెండు చోరీలు జరిగాయి. ఈ రెండు చోట్ల దొంగలు ఎత్తుకు వెళ్లింది సిగరెట్లనే.. వారం రోజుల క్రితం కొల్లూరు మండల కేంద్రంలోని శివాలయం పక్కనే పుల్లయ్య హోల్ సేల్ దుకాణం ఉంది. మండల కేంద్రంతో పాటు లంక గ్రామాలకు చెందిన చిన్న చిన్న షాపులకు చెందిన వాళ్లు ఇక్కడకు వచ్చి హోల్ సేల్ గా కొనుగోలు చేస్తుంటారు. కొంతకాలంగా ఈ హోల్ సేల్ షాపుపై రెక్కి నిర్వహించిన ఇద్దరూ దొంగలు అర్ధరాత్రి సమయంలో షాపులోకి చొరబడ్డారు. అతని దుకాణంలో ఉన్న సిగరెట్లను గోతంలో సర్ధుకొని అక్కడ నుండి ఉడాయించారు. పుల్లయ్య తమ షాపులో చోరి అయినవి సిగరెట్లని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది జరిగి వారం రోజులు గడవక ముందే దోనేపూడిలో మరొక చోరికి పాల్పడ్డారు దొంగలు.

దోనేపూడిలో సుధాకర్ పంచాయితీ కార్యాలయం వెనుక దుకాణం నిర్వహిస్తున్నాడు. నిన్న రాత్రి దుకాణం వద్దకు వచ్చిన యువకుడు రాడ్డుతో తాళం పగులకొట్టి షట్టర్ తెరిచి లోపలికి వెళ్లాడు. బయటకు వస్తూ గోతాం నిండా సిగరెట్ ప్యాకెట్స్ వేసుకొని వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అప్పటికే బైక్ పై వెయిట్ చేస్తున్న వ్యక్తితో కలిసి అక్కడ నుండి పరారయ్యాడు. ముప్పై వేల రూపాయల సిగరెట్లను తస్కరించినట్లు సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడు వేల రూపాయల వరకూ నగదు కూడా తీసుకెళ్లాడు. వరుసగా రెండు చోట్ల సిగరెట్ల కోసమే దొంగతనం జరగడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. చోరి సిసి కెమెరా విజువల్స్ సేకరించిన పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. సిగరెట్ల కోసమే దొంగతనం చేస్తుండటంపై పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామన్నారు.

వీడియో చూడండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us