AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్.. రంగంలోకి ముగ్గుర్ని దింపిన గంభీర్..?

ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి గాయాల పాలు కావడం టీమిండియాను తీవ్ర ఆందోళనలో పడేసింది. ఈ నేపథ్యంలో, 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నీని దృష్టిలో ఉంచుకుని మేనేజ్‌మెంట్ ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టింది. హార్దిక్, నితీష్‌లకు బ్యాకప్‌గా జట్టులోకి రాగల ఆ ముగ్గురు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Venkata Chari
|

Updated on: Jun 17, 2026 | 6:51 PM

Share
ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ ముందే హార్దిక్ పాండ్యా కాలి మడమ గాయంతో (leg sprain) దూరమవగా, ధర్మశాలలో జరిగిన తొలి మ్యాచ్ తర్వాత తెలుగు తేజం నితీష్ రెడ్డి కూడా క్వాడ్ ఇంజూరీ (quad injury) కారణంగా పక్కన కూర్చోవాల్సి వచ్చింది. భారత జట్టులో మ్యాచ్ విన్నర్లుగా మారిన ఈ ఇద్దరు కీలక సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కెరీర్ తరచూ గాయాల బారిన పడటం సెలక్టర్ల నిద్ర చెడగొడుతోంది. 2027 వన్డే వరల్డ్ కప్ ఆఫ్రికా ఖండంలో జరగనుంది. అక్కడి పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు ఎక్కువగా సహకరిస్తాయి కాబట్టి, జట్టులో నాణ్యమైన పేస్ ఆల్‌రౌండర్లు ఉండటం అత్యంత కీలకం. అందుకే హార్దిక్, నితీష్ జోడీకి ప్రత్యామ్నాయంగా ముగ్గురు యువ ఆటగాళ్లను సిద్ధం చేయాల్సిన సమయం వచ్చేసింది.

1 / 5
1. సూర్యాంశ్ శెడ్గే (Suryansh Shedge) – భవిష్యత్తు ఆశాకిరణం: ముంబైకి చెందిన సూర్యాంశ్ శెడ్గే ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో 175.56 స్ట్రైక్ రేట్‌తో 158 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. లోయర్ ఆర్డర్‌లో వచ్చి భారీ సిక్సర్లు బాదడమే కాకుండా, మీడియం పేస్ బౌలింగ్‌తో వికెట్లు తీయగలగడం ఇతని ప్రత్యేకత. ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోన్న ట్రై-నేషన్ సిరీస్‌లో ఇండియా-ఏ తరపున సూర్యాంశ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కష్ట కాలంలో జట్టును ఆదుకుంటూ 48.33 సగటుతో 145 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 13 మ్యాచ్‌ల్లో 249 పరుగులు, 10 వికెట్లు తీసిన ఈ యువ క్రికెటర్.. హార్దిక్ పాండ్యాకు పక్కా రీప్లేస్‌మెంట్‌గా మారే అన్ని అర్హతలూ కలిగి ఉన్నాడు.

2 / 5
2. అర్షద్ ఖాన్ (Arshad Khan) – ఎడమచేతి వాటం అస్త్రం: సెలక్టర్ల రేసులో ఉన్న మరో ఆసక్తికరమైన పేరు అర్షద్ ఖాన్. గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్‌లో మెరిసిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, కొత్త బంతితో స్వింగ్ చేయడంలో సిద్ధహస్తుడు. అంతేకాదు, బ్యాటింగ్‌లోనూ సుదీర్ఘమైన సిక్సర్లు కొట్టగల సామర్థ్యం ఇతనికి ఉంది. ఐపీఎల్ 2026 లో గుజరాత్ తరఫున 209.09 స్ట్రైక్ రేట్‌తో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటమే కాకుండా 6 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత శ్రీలంక ట్రై-సిరీస్‌లోనూ 3 ఇన్నింగ్స్‌ల్లో 4 వికెట్లు తీసి మంచి ఎకానమీతో రాణిస్తున్నాడు. టీమిండియా లోయర్ ఆర్డర్‌లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కమ్ బౌలర్ కావాలనుకుంటే అర్షద్ ఖాన్ బెస్ట్ ఛాయిస్ అవుతాడు.

3 / 5
3. శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) – అనుభవజ్ఞుడైన 'లార్డ్': జట్టు మేనేజ్‌మెంట్ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా, నమ్మకమైన సీనియర్ ఆటగాడి వైపు మొగ్గు చూపాలనుకుంటే శార్దూల్ ఠాకూర్ మళ్లీ రేసులోకి వస్తాడు. 'పాలఘర్ ఎక్స్‌ప్రెస్' గా పిలవబడే శార్దూల్.. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో దిట్ట. భారత్ తరఫున ఇప్పటికే 47 వన్డేలు ఆడిన అనుభవం ఇతనికి ఉంది. అందులో 329 పరుగులు చేయడంతో పాటు 33 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా లాంటి బౌన్సీ పిచ్‌లపై శార్దూల్ వేసే నకిల్ బాల్స్, వైవిధ్యమైన డెలివరీలు జట్టుకు బాగా ఉపయోగపడతాయి. యువ ఆటగాళ్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్న చోట శార్దూల్ అనుభవం బ్యాకప్‌గా బాగా పనిచేస్తుంది.

4 / 5
హార్దిక్ పాండ్యా, నితీష్ రెడ్డిల ఫిట్‌నెస్ సమస్యలు టీమిండియాకు హెచ్చరిక లాంటివని చెప్పాలి. 2027 వరల్డ్ కప్ లోగా సూర్యాంశ్ శెడ్గే, అర్షద్ ఖాన్ లాంటి యువకులకు అంతర్జాతీయ స్థాయిలో తగినన్ని అవకాశాలు ఇచ్చి నిలబెట్టాలి. అప్పుడే మెగా టోర్నీ సమయానికి ఎలాంటి గాయాల సమస్యలు ఎదురైనా భారత్ బలంగా బరిలోకి దిగగలుగుతుంది.

5 / 5
Follow Us