Vastu Tips: ఇంట్లో ఈ దిశలో నవ్వుతున్న బుద్ధుడిని పెడితే అదృష్టం మీ సొంతం.. మీకు స్వర్ణ యుగం మొదలైనట్లే!
ఫెంగ్ షుయ్ , వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో నవ్వుతున్న బుద్ధుడి (లాఫింగ్ బుద్ధ) విగ్రహాన్ని ఉంచుకోవడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. నవ్వుతున్న బుద్ధుడు ఇంటికి సానుకూల శక్తిని తీసుకురావడంతో పాటు సంపదను ఆకర్షించడానికి, కుటుంబంలో సంతోషాన్ని పెంచడానికి అద్భుతంగా సహాయపడతాడు. అయితే లాఫింగ్ బుద్ధుడిలో ఉండే విభిన్న రూపాలు వేర్వేరు ఫలితాలను ఇస్తాయని, వాటిని ఉంచే దిశలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారానే ఆర్థిక ఇబ్బందులు తొలగి ఆశించిన విజయాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎంత కష్టపడి సంపాదించినప్పటికీ చేతిలో డబ్బు నిలవక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. అటువంటి వారు తమ జీవితంలో ఆర్థిక వృద్ధిని సాధించడానికి, ఇంట్లో సుఖశాంతులను పెంపొందించుకోవడానికి నవ్వుతున్న బుద్ధుని విగ్రహాన్ని తెచ్చి పెట్టుకుంటారు. వాస్తు , ఫెంగ్ షుయ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, లాఫింగ్ బుద్ధుడి విగ్రహం ఉన్న ఇళ్లలో ప్రతికూల శక్తులు నశించి, లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. అయితే మార్కెట్లో రకరకాల రూపాల్లో లభించే నవ్వుతున్న బుద్ధుడి విగ్రహాలలో ఏది దేనికి ప్రతీక, వాటిని ఇంటిలో ఏ దిశలలో ఉంచడం వల్ల సువర్ణ కాలం ప్రారంభమవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
విభిన్న రూపాల నవ్వుతున్న బుద్ధుడు… భుజంపై సంచితో ఉన్న బుద్ధుడు: భుజంపై ఒక పెద్ద సంచిని (మూటను) వేసుకుని ఉండే నవ్వుతున్న బుద్ధుడి విగ్రహం ఇంటికి ఎంతో శ్రేష్ఠమైనది. ఈ సంచి మన ఇంట్లోని లేదా మనసులోని దుఃఖాలను, కష్టాలను తనలోకి గ్రహించి, ప్రతిఫలంగా అపారమైన సంపదను, ఆనందాన్ని ఇస్తుందని నమ్ముతారు. ఈ రకమైన విగ్రహాన్ని వ్యాపార సంస్థలలో లేదా ఆఫీసులలో ఉంచడం వల్ల వ్యాపారం అద్భుతంగా వృద్ధి చెందుతుంది.
రెండు చేతులు పైకెత్తిన బుద్ధుడు: రెండు చేతులను ఆకాశం వైపు పైకెత్తి నవ్వుతున్నట్లు ఉండే బుద్ధుడి విగ్రహం అదృష్టాన్ని, సంపదను వేగంగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మీ సొమ్ము లేదా రావలసిన డబ్బు ఎక్కడైనా చాలా కాలంగా చిక్కుకుపోయి ఉంటే, ఈ విగ్రహాన్ని తెచ్చుకోవడం వల్ల ఆ సమస్యలు త్వరగా తొలగిపోతాయి.
పిల్లలతో ఉన్న నవ్వుతున్న బుద్ధుడు: చుట్టూ చిన్న పిల్లలతో ఆడుకుంటున్నట్లు ఉండే నవ్వుతున్న బుద్ధుడి విగ్రహం గృహ కలహాలను, కుటుంబంలో ఉండే మనస్పర్థలను పరిష్కరించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను పెంచడంతో పాటు సంతాన ప్రాప్తికి , సంపదను కూడబెట్టడానికి చాలా మంచిదని భావిస్తారు.
నాణేలపై కూర్చున్న బుద్ధుడు: చేతిలో బంగారు నాణేలు పట్టుకుని లేదా నాణేల రాశిపై కూర్చుని ఉండే నవ్వుతున్న బుద్ధుడు పూర్తిగా ధన ప్రవాహంతో ముడిపడి ఉంటాడు. ఈ విగ్రహాన్ని ఇంట్లోని ముఖ్యమైన అల్మరా లేదా నగదు దాచుకునే సేఫ్ లాకర్ (క్యాష్ బాక్స్) దగ్గర ఉంచుకోవడం వల్ల ఆర్థిక కొరత ఏర్పడకుండా డబ్బు నిరంతరం రెట్టింపు అవుతుందని నమ్ముతారు.
వాస్తు నియమాలు నవ్వుతున్న బుద్ధుడి విగ్రహాన్ని ఎంపిక చేసుకోవడమే కాకుండా దానిని ఇంట్లో సరైన పద్ధతిలో ఉంచడం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం ఈ క్రింది నియమాలను ఖచ్చితంగా పాటించాలి.
ప్రవేశ ద్వారం వద్ద అమరిక: విగ్రహాన్ని ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం (మెయిన్ డోర్) వైపు ముఖం ఉండేలా అమర్చాలి. అయితే బయటి నుండి ఎవరైనా లోపలికి ప్రవేశించినప్పుడు విగ్రహం కనిపించాలి కానీ, అది ఇంటి లోపలి వైపునకు చూస్తున్నట్లుగా ఉండాలి. ఇది బయటి నుండి వచ్చే ప్రతికూలతను (నెగటివిటీ) దూరంగా ఉంచి, సానుకూలతను ఇట్లోకి ఆహ్వానిస్తుంది.
హాల్‌లో దిశ: ఇంటి లివింగ్ రూమ్ లేదా డ్రాయింగ్ రూమ్‌లో ఉంచేటప్పుడు విగ్రహాన్ని తూర్పు దిశ వైపుకు ఉండేలా చూసుకోవాలి. ఇది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యాన్ని, ప్రేమను పెంపొందిస్తుంది , ఆర్థిక కొరత రాకుండా కాపాడుతుంది.
వ్యాపార స్థలాలు , ఆఫీసులలో: మీ దుకాణంలో లేదా కార్యాలయంలో సేల్స్ పెరగడానికి , లక్ష్మీ కటాక్షం కోసం క్యాష్ కౌంటర్ దగ్గర లేదా ఉత్తర దిశలో నవ్వుతున్న బుద్ధుడి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడం చాలా ఉత్తమం.
పొట్టను రుద్దే అలవాటు: ఒక నమ్మకం ప్రకారం, ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత నవ్వుతున్న బుద్ధుని పొట్టపై చేతితో మెల్లగా రుద్దుతూ మీ మనసులోని కోరికను చెప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ మనోభీష్టాలు నెరవేరుతాయని ఫెంగ్ షుయ్ శాస్త్రం చెబుతోంది.
చేయకూడని తప్పులు.. నవ్వుతున్న బుద్ధుని విగ్రహాన్ని ఎప్పుడూ నేరుగా నేలపై లేదా కింద పెట్టకూడదు, ఎల్లప్పుడూ ఎత్తైన ప్రదేశంలోనే ఉంచాలి. అలాగే ఈ పవిత్రమైన విగ్రహాన్ని పొరపాటున కూడా మీ పడకగది, బాత్రూమ్ లేదా వంటగదిలో అస్సలు పెట్టకూడదు.
ముఖ్యమైన విషయం ఏమిటంటే, నవ్వుతున్న బుద్ధుని విగ్రహాన్ని ఇతరుల నుండి ఎప్పుడూ బహుమతిగా తీసుకోకూడదు, మీ సొం డబ్బుతో మీరే కొనుక్కుని తెచ్చుకోవాలి. ఒకవేళ ఇంట్లో ఉన్న విగ్రహం ఎక్కడైనా కొద్దిగా విరిగిపోయినా లేదా పగుళ్లు ఇచ్చినా దానిని ఇంట్లో ఉంచుకోకుండా ఏదైనా నదిలో లేదా ప్రవహించే కాలువలో నిమజ్జనం చేయాలి. విగ్రహాన్ని ఎల్లప్పుడూ దుమ్ము లేకుండా చాలా శుభ్రంగా ఉంచడం ముఖ్యం, ఎందుకంటే అది మురికిగా మారితే దాని సానుకూల ప్రభావం తగ్గుతుంది. కాబట్టి వారానికి ఒకసారి మెత్తటి పొడి గుడ్డతో దానిని శుభ్రంగా తుడవాలి. ఈ వాస్తు చిట్కాలను పక్కాగా పాటించి నవ్వుతున్న బుద్ధుడిని సరైన పద్ధతిలో ఉంచుకోవడం ద్వారా మీ ఇంట్లో శాంతి, శ్రేయస్సు , సంతోషకరమైన వాతావరణాన్ని నింపుకోండి.
