AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Six Fingers Meaning: ఐదు కాదు.. ఆరు వేళ్లు ఉన్నవారు నిజంగా అదృష్టవంతులా? సాముద్రిక శాస్త్రం ఏం చెబుతోంది?

సాధారణంగా ప్రతి చేతికి ఐదు వేళ్లు ఉంటాయి. అయితే కొంతమందికి పుట్టుకతోనే చేతికి ఆరు వేళ్లు ఉంటాయి. మరికొందరికి పాదాల్లోనూ అదనపు వేలు కనిపిస్తుంది. ఇలా ఉండటాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. అయితే చేతికి ఆరు వేళ్లు ఉండటం వెనుక ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. ఈ శాస్త్రం ప్రకారం మనిషి శరీర నిర్మాణం, అవయవాల ఆకృతి ఆధారంగా వారి స్వభావం, వ్యక్తిత్వం గురించి కొన్ని నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి.

Six Fingers Meaning: ఐదు కాదు.. ఆరు వేళ్లు ఉన్నవారు నిజంగా అదృష్టవంతులా? సాముద్రిక శాస్త్రం ఏం చెబుతోంది?
Six Fingers Meaning In Samudra Shastra
Bhavani
|

Updated on: Nov 17, 2026 | 7:10 PM

Share

చేతికి ఆరు వేళ్లు ఉన్నవారిని తెలివైనవారు, సృజనాత్మక ఆలోచనలు కలిగినవారు, కష్టపడి పనిచేసేవారిగా పరిగణిస్తారని చెబుతారు. తమ లక్ష్యాలను చేరుకునే విషయంలో వెనుకడుగు వేయరని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారని కూడా కొన్ని సంప్రదాయ విశ్వాసాలు పేర్కొంటున్నాయి. మరి అలాంటి వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయని సాముద్రిక శాస్త్రం చెబుతోంది? తెలుసుకుందాం.

తెలివితేటలు ఎక్కువగా ఉంటాయట

సాముద్రిక శాస్త్రం ప్రకారం చేతికి ఆరు వేళ్లు ఉన్నవారు తెలివైనవారిగా భావిస్తారు. ఏదైనా విషయాన్ని త్వరగా అర్థం చేసుకోవడం, కొత్త విషయాలను సులభంగా నేర్చుకోవడం వీరి ప్రత్యేకతగా చెబుతారు. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించడానికి కొత్త మార్గాలను ఆలోచిస్తారని నమ్ముతారు.

సృజనాత్మక ఆలోచనలు కలిగి ఉంటారట

ఆరు వేళ్లు ఉన్నవారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందని సాముద్రిక శాస్త్రంలోని నమ్మకాలు చెబుతున్నాయి. ఏ పనినైనా అందరూ చేసే విధంగా కాకుండా, తమదైన శైలిలో చేయడానికి ప్రయత్నిస్తారట. చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా గమనించడం, పనిలో కొత్తదనం చూపించడం వీరి లక్షణాలుగా పేర్కొంటారు.

కష్టపడే తత్వం.. లక్ష్యంపై పట్టుదల

వీరు చాలా కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారని చెబుతారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత శ్రమించాల్సి వచ్చినా వెనక్కి తగ్గరని నమ్మకం. ఒకవేళ ఏదైనా పనిలో ఓటమి ఎదురైనా నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నిస్తారట. పట్టుదలతో ముందుకు సాగడం వల్ల ఉద్యోగం, వ్యాపారం వంటి రంగాల్లో మంచి విజయాలు సాధిస్తారని సాముద్రిక శాస్త్రం వివరిస్తుంది.

ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారట

ఆరు వేళ్లు ఉన్నవారు తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరుస్తారని చెబుతారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడటం వీరికి నచ్చదట. ఎదుటివారికి తమ మాటలు నచ్చకపోయినా, అనుకున్న విషయాన్ని నేరుగా చెప్పడానికి ఇష్టపడతారని నమ్ముతారు.

స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు

వీరు ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోవడానికి ఇష్టపడతారని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయాలను స్వయంగా తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారట. పరిస్థితులకు అనుగుణంగా తమ ఆలోచనలను మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారని భావిస్తారు.

కొన్నిసార్లు మొండిపట్టుదల చూపిస్తారట

ప్రతి లక్షణంలో మంచి, చెడు రెండూ ఉండవచ్చు. ఆరు వేళ్లు ఉన్నవారు ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటారని చెబుతారు. అయితే ఈ పట్టుదల కొన్నిసార్లు మొండితనంగా మారవచ్చట. తమ అభిప్రాయమే సరైందని భావించి, ఇతరులు చెప్పే విషయాలను అంగీకరించడానికి కొంత సమయం తీసుకుంటారని సాముద్రిక శాస్త్రంలోని నమ్మకాలు పేర్కొంటున్నాయి.

గమనిక: సాముద్రిక శాస్త్రంలో చెప్పిన ఈ లక్షణాలు సంప్రదాయ నమ్మకాల ఆధారంగా ఉన్నవే. చేతికి ఆరు వేళ్లు ఉండటాన్ని వైద్య పరిభాషలో పాలిడాక్టిలీ (Polydactyly) అంటారు. అదనపు వేలు ఉండటం వల్ల ఒక వ్యక్తి తెలివితేటలు, స్వభావం లేదా భవిష్యత్తును నిర్ణయించలేము.

Follow Us