AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10లోకి ఆ ‘జబర్దస్త్’ ముద్దుగుమ్మలు! ఇక టీఆర్పీ రేటింగ్ రికార్డులు బద్దలవ్వాల్సిందే

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ ఎవరన్న విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఈసారి హౌస్ లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి కంటెస్టెంట్ల లిస్ట్ లో ఇద్దరు జబర్దస్త్ ముద్దుగుమ్మల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10లోకి ఆ 'జబర్దస్త్' ముద్దుగుమ్మలు! ఇక టీఆర్పీ రేటింగ్ రికార్డులు బద్దలవ్వాల్సిందే
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Jun 17, 2026 | 9:03 PM

Share

బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ ఈ రియాలిటీ షో సూపర్ హిట్ గా నిలిచింది. రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. ఇక తెలుగులోనూ ఇప్పటికే 9 సీజన్లు పూర్తయ్యాయి. త్వరలోనే పదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారికంగా ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అలాగే పదో సీజన్ కు సంబంధించి వరుసగా అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. కాగా గత సీజన్ల కంటే ఈ సారి బిగ్ బాస్ మరింత స్పెషల్ గా ఉండనుందని తెలుస్తోంది. ఎందుకంటే తెలుగులో ఈ రియాలిటీ షో ప్రారంభమై పదేళ్లు గడిచిపోయాయి. అందుకే ఈ ల్యాండ్ మార్క్ సీజన్ కోసం ఈసారి మరిన్ని అదనపు హంగులు జోడించనున్నట్లు సమాచారం. అలాగే కంటెస్టెంట్ల ఎంపికలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత సీజన్ లాగే ఈసారి బిగ్ బాస్ షోలో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఉండనున్నారు. ఇందు కోసం త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు అగ్నిపరీక్ష సీజన్ 2 కూడా స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించిన విధి విధానాలపై ఇటీవల బిగ్ బాస్ నిర్వాహకులు అప్డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్ తెలుగు 10 సెలబ్రిటీ కంటెస్టెంట్స్‌కు సంబంధించి పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. సినీ తారలు, బుల్లితెర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, సింగర్లు, కొరియోగ్రాఫర్లు, యాంకర్లు.. ఇలా అన్నీ కేటగిరీల నుంచి ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఎంపిక చేయనున్నారు. ఈసారి కంటెస్టెంట్ల జాబితాలో కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ, బుల్లితెర స్టార్ ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్‌లు కంటెస్టెంట్లుగా రానున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

యాంకర్ వర్షిణీ లేటెస్ట్ ఫొటోస్..

అయితే లేటెస్ట్ గా జబర్దస్త్ ముద్దుగుమ్మలు, క్రేజీ యాంకర్స్ వర్ష, వర్షిణీలు కూడా బిగ్ బాస్ 10 లో సందడి చేయనున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటు గ్లామర్ పరంగానూ, అటు యాక్టింగ్ పరంగానూ బుల్లితెరపై వీరిక మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలోనూ సూపర్బ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో వర్ష, వర్షిణీలను బిగ్ బాస్ లోకి తీసుకొస్తే టీఆర్పీ రేటింగ్ పరంగానూ మంచి ప్రయోజనముంటుందని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. దీనికి సంబంధించి ఇద్దరితోనూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

వర్ష గ్లామరస్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us