యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో లింగంపల్లి నరసింహ ఇంటిలో రూ.22 లక్షల భారీ నగదు చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి వెళ్లగా, దుండగులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుల పట్టివేతకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.