నా టైం అస్సలు బాలేదు.. అందుకే సినిమాలు హిట్ కావట్లేదు.. హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
22 February 2026
మొన్నటివరకు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ పూజా హెగ్డే. కానీ ఇప్పుడు ఈ అమ్మడు ఫేమ్ తగ్గిపోయింది. ఆమె చేసిన సినిమాలు హిట్స్ కావడం లేదు.
అప్పట్లో స్టార్ హీరోలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తుంది. అలాగే సినిమాను నుంచి తప్పుకుంటుంది.
ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
అయితే చాలా కాలంగా ఈ బ్యూటీ ఖాతాలో హిట్టు పడడం లేదు. కొన్నాళ్లుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అన్ని భాషలలోనూ ప్లాప్ హీరోయిన్ గా ముద్ర వేసుకుంటుంది.
తాజాగా ఓ పాడ్ కాస్టులో పాల్గొన్న పూజా హెగ్డే తన కెరీర్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తన టైమ్ అస్సలు బాగలేదని చెప్పుకొచ్చింది పూజా.
చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయని.. కొన్నాళ్లుగా తన జీవితం సక్సెస్ అనే మాటకు దూరమయ్యిందని.. అందుకే ఇప్పుడు తన జీవితంలో ప్రత్యేక సమయం అని తెలిపింది.
ఇక నుంచి తాను చేసే సినిమాలు తనలోని నటిని పరిచయం చేస్తాయని తెలిపింది. సినిమా బ్యాగ్రౌండ్ లేని తనలాంటి అమ్మాయిలు ఇండస్ట్రీలో కొనసాగడం కష్టమని అన్నారు.
ప్రస్తుతం తాను సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. నిలబడతాను అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం పూజా చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.