- Telugu News Photo Gallery Cinema photos Actress Tamannah Bhatia Visits Kamakya Temple, Shares Photos
Tamannaah Bhatia: ప్రఖ్యాత కామాఖ్య ఆలయంలో తమన్నా ప్రత్యేక పూజలు.. కారణమిదే.. ఫొటోస్ చూశారా?
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా సినిమాల్లో చాలా గ్లామరస్‌గా కనిపిస్తుంది కానీ ఆమె హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యమిస్తుంది. తమన్నాకు భగవంతుని పట్ల అపారమైన నమ్మకం, భక్తి, విశ్వాసాలు ఉన్నాయి.
Updated on: Jan 24, 2024 | 10:37 PM

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా సినిమాల్లో చాలా గ్లామరస్‌గా కనిపిస్తుంది కానీ ఆమె హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యమిస్తుంది. తమన్నాకు భగవంతుని పట్ల అపారమైన నమ్మకం, భక్తి, విశ్వాసాలు ఉన్నాయి.

ఈ కారణంగానే తరచుగా దేవాలయాలను సందర్శిస్తుంటుందీ అందాల తార. ఇప్పుడు తమన్నా తన కుటుంబ సభ్యులతో కలిసి గౌహతిలోని ప్రఖ్యాత కామాక్య ఆలయాన్ని సందర్శించింది.

కామాక్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది తమన్నా. ఈ సందర్భంగా పసుపు రంగు చుడీదార్, మెడలో హారం, శాలువా, నుదుటిపై కుంకుమతో ఎంతో ట్రెడిషినల్‌గా కనిపించిందీ మిల్కీ బ్యూటీ.

'నా ప్రియమైన వారితో కొన్ని మధురమైన భక్తి క్షణాలు గడిపాను' అంటూ తమన్నా తన టెంపుల్ విజిట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

గతంలో ఇషా ఫౌండేషన్‌లో జరిగిన శివరాత్రి, సంక్రాంతి, లింగ భైరవి దేవి పూజల్లో నటి తమన్నా భాటియా పాల్గొంది. అలాగే తన దైనందిన జీవితంలో ధ్యానం, యోగా , ప్రాణాయామం ఒక భాగంగా చేసుకుంది