అర్థరాత్రి ఆ హీరో కాల్… ఒక్క సారిగా నాలో టెన్షన్, భయం!
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. బిగ్ బాస్ నాన్ స్టాప్-2022, బిగ్ బాస్ సీజన్ 7-2023 లలో... రెండు సార్లు కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన ఈమె తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. విజేతగా నిలవకున్నా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టీవీ షోస్, సినిమా ఈవెంట్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది.
ప్రస్తుతం తెలుగులో బిజీయెస్ట్ యాంకర్ గా ఉన్న స్రవంతి సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన హే బలవంత్ సినిమా ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో సుహాస్, శివానీ నాగారం హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చిందీ స్టార్ యాంకర్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో ఓ అర్ధరాత్రి 12 గంటలకు ఓ హీరో కాల్ చేసి మాట్లాడాడంటూ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంది. తాను ఇటీవల ఒక సినిమా ఈవెంట్ చేశానని చెప్పిన స్రవంతి.. కొన్ని కారణాల వల్ల ఆ ఈవెంట్ బాగా లేట్ అయిందని.. దీంతో ఈవెంట్ ముగిసాక రాత్రి 12 గంటల సమయంలో ఆ సినిమా హీరో తనకు ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టాడంటూ చెప్పుకొచ్చింది. ఫ్రీ గా ఉన్నప్పుడు కాల్ చేయండి అని ఆ హీరో మెసేజ్ చేశాడని.. అయితే మొదట మెసేజ్ చూడగానే తనకు భయమేసిందంటూ స్రవంతి చెప్పుకొచ్చింది. ఆ హీరో గురించి ఈవెంట్లో తాను ఏమైనా తప్పు మాట్లాడానా అని కంగారు పడుతూ ఆలోచించానని.. చెప్పుకొచ్చింది.
మరిన్ని వీడియోల కోసం :
తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?
ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!
టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

