గుజరాత్ ప్రభుత్వం ప్రేమ వివాహాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రేమ వివాహం చేసుకోవాలంటే తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి. మోసాలు, లవ్ జిహాద్ వంటి ఘటనలను అరికట్టడమే దీని లక్ష్యం. అప్లికేషన్ సమర్పించిన తర్వాత నెల రోజుల నిరీక్షణ కాలం ఉంటుంది, ఈ సమయంలో తల్లిదండ్రులు అభ్యంతరం చెబితే వివాహం జరగదు.