AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: విదేశీ అతిధులు… పురుడుకోసం పుట్టింటికొచ్చే పక్షులు… తరతరాలుగా వీడని అనుబంధం.

ఒక చిన్న గ్రామం… కానీ వేల మైళ్ల దూరం నుంచి వచ్చే విదేశీ అతిథులకు అది సురక్షితమైన నిలయం. ప్రకాశం జిల్లా వెలమవారిపాలెంలో జనవరి మొదలైతే చాలు, ఆకాశం నిండా కొంగల కిలకిలరావాలు మార్మోగుతాయి. రెండు మూడు వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అనుబంధం, కేవలం పక్షులు–మనుషుల మధ్య సంబంధం కాదు… అది విశ్వాసం, భక్తి, ప్రేమల మేళవింపు.

Andhra: విదేశీ అతిధులు... పురుడుకోసం పుట్టింటికొచ్చే పక్షులు... తరతరాలుగా వీడని అనుబంధం.
Bird Conservation
Fairoz Baig
| Edited By: |

Updated on: Feb 22, 2026 | 10:02 PM

Share

అది ఒక చిన్న కుగ్రామం.. కానీ ప్రతి ఏటా వేల మైళ్ల దూరం నుంచి వచ్చే విదేశీ పక్షులకు అది ఒక సురక్షితమైన ఆశ్రయం. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమవారిపాలెం గ్రామం ఇప్పుడు విదేశీ కొంగల కిలకిలరావాలతో సందడిగా మారింది. దాదాపు రెండు మూడు వందల ఏళ్లుగా ఈ గ్రామానికి, విదేశీ పక్షులకు మధ్య విడదీయలేని అనుబంధం కొనసాగుతోంది.

స్థానికుల కథనం ప్రకారం ఈ పక్షులు నైజీరియా, కొరియా వంటి సుదూర దేశాల నుంచి వలస వస్తాయి. ఏటా జనవరి, ఫిబ్రవరి నాటికి ఇక్కడికి చేరుకుంటాయి. దాదాపు ఆరు నెలల పాటు ఇక్కడే ఉండి, జూన్ నెలలో తమ పిల్లలతో కలిసి తిరిగి ప్రయాణమవుతాయి. వెలమవారిపాలెం గ్రామస్థులు ఈ పక్షులను కేవలం అతిథులుగా మాత్రమే కాదు, తమ గ్రామ దేవతలుగా భావిస్తారు. వేటగాళ్ల నుంచి, దొంగల నుంచి ఈ పక్షులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వర్షాలు లేని సమయంలో సమీపంలోని గుండ్లకమ్మ నది ఎండిపోయినప్పుడు, గ్రామస్థులే సొంతంగా కుంటలు తవ్వించి, బోరు బావుల ద్వారా నీటిని నింపుతున్నారు. అంతేకాదు, పక్షుల కోసం చేపలను కొనుగోలు చేసి మరీ కుంటల్లో వేస్తూ వాటి ఆకలి తీరుస్తున్నారు.

ఈ పక్షులు ప్రధానంగా గ్రామంలోని చింత, వేప చెట్లపై గూళ్లు కట్టుకుంటాయి. ఈ దృశ్యాన్ని చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు, పర్యాటకులు తరలివస్తుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ పక్షుల సంరక్షణకు ప్రభుత్వం మరింత సహకరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించి, పక్షుల నివాసానికి అనువుగా మరిన్ని చెట్లను పెంచాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రకృతికి, మనిషికి మధ్య ఉన్న ఈ అద్భుత బంధం వెలమవారిపాలెంలో స్పష్టంగా కనిపిస్తోంది. మూగ జీవాల పట్ల ఆ గ్రామస్థులు చూపిస్తున్న ప్రేమ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

Also Read: అప్పుగా ఇచ్చిన డబ్బు తీసుకున్నవారు ఎగ్గొట్టారా.. ఇలా చేయండి.. 

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్