అందంతో చంపేస్తున్న హీరోయిన్.. 40 ఏళ్ల వయసులో ఊహించని లుక్..

Rajitha Chanti

Pic credit - Instagram

22 February 2026

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యింది. ఆ హీరోయిన్ మరెవరో కాదండి.. కాజల్ అగర్వాల్..

కాజల్ అగర్వాల్.. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత చందమామ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ కాజల్ కెరీర్ మలుపు తిప్పింది. తెలుగు, తమిళం భాషలలో వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయింది.

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కాజల్.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కాజల్.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట ఒక్కసారిగా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. 40 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గని అందంతో కట్టిపడేస్తుంది. 

ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. కాజల్ లేటేస్ట్ లుక్ చూస్తుంటే ఆమె త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.