AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Movie: ‘హనుమాన్‌’ బాటలోనే ‘రామ్‌’.. తెగే ప్రతి టికెట్‌లో రూ.5 నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళం

తమ సినిమాకు తెగే ప్రతి టికెట్టులో రూ.5లను అయోధ్య రామమందిరానికి విరాళమిచ్చింది హనుమాన్‌ చిత్ర బృందం. ఇప్పుడిదే బాటలో 'రామ్‌' చిత్రం కూడా మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. తమ సినిమా ప్రతి టికెట్‌పై వచ్చే రూ. 5లను నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌కు విరాళం అందించనున్నట్లు రామ్‌ చిత్ర బృందం ప్రకటించింది.

Ram Movie: 'హనుమాన్‌' బాటలోనే 'రామ్‌'.. తెగే ప్రతి టికెట్‌లో రూ.5 నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళం
Ram Rapid Action Mission Movie
Basha Shek
|

Updated on: Jan 24, 2024 | 9:11 PM

Share

‘హనుమాన్‌’ బాటలోనే ‘రామ్‌’ కూడా నడవనుంది. తమ సినిమాకు తెగే ప్రతి టికెట్టులో రూ.5లను అయోధ్య రామమందిరానికి విరాళమిచ్చింది హనుమాన్‌ చిత్ర బృందం. ఇప్పుడిదే బాటలో ‘రామ్‌’ చిత్రం కూడా మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. తమ సినిమా ప్రతి టికెట్‌పై వచ్చే రూ. 5లను నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌కు విరాళం అందించనున్నట్లు రామ్‌ చిత్ర బృందం ప్రకటించింది. దేశ భక్తి కథతో తెరకెక్కిన ఈ మూవీలో అయ్యల సోమయాజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటిస్తున్నారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. దీపికాంజలి వడ్లమాని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రామ్‌ సినిమాను నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 26న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా రామ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్‌. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దీపికాంజలి కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాకు తెగే ప్రతి టికెట్‌ మీద ఐదు రూపాయలు నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా అందజేస్తామని ప్రకటించారు.

‘మాకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. మాకు ఇదే మొదటి సినిమా. దర్శకుడు చెప్పిన బడ్జెట్‌లో రామ్‌ను అద్భుతంగా తెరకెక్కించాం. ఇందులో భాను చందర్‌, సాయి కుమార్‌, శుభలేఖ సుధాకర్‌ వంటి దిగ్గజాలు నటించారు. వారి నటన గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. మా సినిమాకు తెగే ప్రతి టికెటలో రూ.5లను నేషనల్‌ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా అందేజేస్తాం. మన దేశ సైనికులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నాం’ అని నిర్మాత దీపికాంజలి తెలిపారు. రామ్‌ చిత్ర బృందం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. సైనికుల సంక్షేమం కోసం చాలా మంచి నిర్ణయం తీసుకున్నారంటూ పలువురు ప్రముఖులు కితాబిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సైనికులకు మా సినిమా అంకితం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?