Ravali: శ్రీకాంత్ ‘పెళ్లి సందడి’ హీరోయిన్ రవళి గుర్తుందా ?.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా ?..
1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో జన్మించింది రవళి. 1990లో జడ్జిమెంట్ అనే మలయాళ సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత జయభేరి సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. నటిగా అరంగేట్రం చేసిన నాలుగేళ్లపాటు ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. కానీ తెలుగులో అందుకున్న తొలి సూపర్ హిట్ ఆమె కెరీర్ టర్న్ అయ్యేలా చేసింది. అదే పెళ్లి సందడి చిత్రం.
ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయిక రవళి. తెలుగు, తమిళంతోపాటు కన్నడలోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగులో రవళికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కనిపించింది. దాదాపు 20 ఏళ్ల పాటు నటిగా కొనసాగిన రవళి.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యింది. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో జన్మించింది రవళి. 1990లో జడ్జిమెంట్ అనే మలయాళ సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత జయభేరి సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. నటిగా అరంగేట్రం చేసిన నాలుగేళ్లపాటు ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. కానీ తెలుగులో అందుకున్న తొలి సూపర్ హిట్ ఆమె కెరీర్ టర్న్ అయ్యేలా చేసింది. అదే పెళ్లి సందడి చిత్రం.
‘మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే.. మా తోట చిలకమ్మా నీ కోసం ఎదురే చూసే ‘.. పాటతో అప్పట్లో రవళికి యూత్ ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది. 1996లో వచ్చిన పెళ్లి సందడి సినిమా రవళికి గుర్తింపు తీసుకువచ్చింది. దీంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఒరేయ్ రిక్షా, వినోదం, చిన్నబ్బాయి, ముద్దుల మొగుడు, శుభాకాంక్షలు, మర్డ్ (హిందీ) వంటి సినిమాలు ఆమెకు మరింత పేరు తీసుకువచ్చాయి.
కథానాయికగా ఛాన్సులు తగ్గిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించింది. 2011లో మాయగాడు అనే సినిమాలో చివరగా నటించింది. 2007లో నీలి కృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది రవళి. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బుల్లితెరపై సీనియర్ నటి హరితకు.. రవళి అక్క అవుతుంది. కొన్నాళ్ల క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది రవళి. ప్రస్తుతం ఆమె లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.