AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Lakshmi: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ.. ఇంట్లో మంచు లక్ష్మి పూజలు.. ఎలా చేసిందో మీరే చూడండి

అయోధ్యుకు రాలేని హిందువులు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టను తిలకిస్తూ తమ ఇళ్లలో, ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టాలీవుడ్ ప్రముఖ నటి, యాంకర్‌ మంచు లక్ష్మి కూడా ఇంటి నుంచే అయోధ్య రామయ్యకు పూజలు నిర్వహించింది. అయితే అది కాస్తా వెరైటీగా చేయడంతో నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Manchu Lakshmi: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ.. ఇంట్లో మంచు లక్ష్మి పూజలు.. ఎలా చేసిందో మీరే చూడండి
Manchu Lakshmi
Basha Shek
|

Updated on: Jan 23, 2024 | 1:56 PM

Share

అయోధ్య రామాలయంలో 500 ఏళ్ల నాటి కల సాకారం అయ్యింది. సోమవారం బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహాక్రతువును వీక్షించేందుకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు, దిగ్గజ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. కోట్లాది మంది రామ భక్తుల సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. అయోధ్యుకు రాలేని హిందువులు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టను తిలకిస్తూ తమ ఇళ్లలో, ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టాలీవుడ్ ప్రముఖ నటి, యాంకర్‌ మంచు లక్ష్మి కూడా ఇంటి నుంచే అయోధ్య రామయ్యకు పూజలు నిర్వహించింది. అయితే అది కాస్తా వెరైటీగా చేయడంతో నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తన ఇంట్లోనే బాల రాముడికి పూజలు చేసింది మంచు లక్ష్మి. అయోధ్య రామ్‌ లల్లా వేడుకను ల్యాప్ టాప్ లో లైవ్ లో చూస్తూ బాల రాముడిపై పూలు జల్లుతూ పూజలు చేసింది. పూజ అనంతరం ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఈ మధ్యన సినిమాలకు, టీవీ షోలకు కొంచెం దూరంగా ఉన్న మంచు లక్ష్మి ఎక్కువగా సామాజిక సేవా కార్యక్రమాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటూ విద్యార్థుల సంక్షేమానికి పాటు పడుతోంది మంచు వారమ్మాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది సర్కారు స్కూళ్లను దత్తత తీసుకున్న మంచువారమ్మాయి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. అంతేకాదు పండగలు, ప్రత్యేక సందర్భాల్లోనూ విద్యార్థులతో గడుపుతూ తన మంచి మనసును చాటుకుంటుందామె.

ఇవి కూడా చదవండి

అయోధ్య రామయ్యకు పూజలు చేస్తోన్న మంచు లక్ష్మి..

కూతురుతో మంచు వారమ్మాయి..

To my incredible daughter, the sweetest soul I know,

Life got a whole lot brighter when you came into it. Your laughter fills our home with endless joy. Happy Daughters’ Day to you and all the wonderful daughters out there! #DaughtersDay #LoveYouAlways #yourforeverfamily pic.twitter.com/dVe9S7Qkv4

— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) September 24, 2023

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.