Hanuman: బాక్సాఫీస్‌పై హనుమాన్‌ గర్జన.. 10 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లోకి.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన హనుమాన్‌ మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. కేవలం రూ. 45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి వారం కంటే మరింత ధీటుగా కలెక్షన్లు రాబడుతోంది

Hanuman: బాక్సాఫీస్‌పై హనుమాన్‌ గర్జన.. 10 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లోకి.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Hanuman Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 22, 2024 | 6:08 PM

హనుమాన్‌ అసలు తగ్గడం లేదు. వరుసగా బాక్సాఫీస్‌ రికార్డులను కొల్లగొడుతూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన హనుమాన్‌ మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. కేవలం రూ. 45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి వారం కంటే మరింత ధీటుగా కలెక్షన్లు రాబడుతోంది. తాజాగా హనుమాన్‌ 10 రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిందని చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా కలెక్షన్ల వివరాలను ప్రకటిస్తూ ఒక కొత్త పోస్టర్‌ను రిలీల్‌ చేసింది. ‘జై శ్రీరామ్. శ్రీరాముడి ఆశీర్వాదాలతో బాక్సాఫీస్ వద్ద హనుమాన్ గర్జన కొనసాగుతోంది. కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా హనుమాన్‍కు రూ.200 కోట్ల కలెక్షన్లు వచ్చాయి’ అని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ ట్వీట్‌ చేసింది. కాగా హనుమాన్ చిత్రానికి 10 రోజు ఏకంగా రూ.23.91 కోట్ల వచ్చాయట. ఇది మొదటి రోజు కంటే ఎక్కవ వసూళ్లు కావడం విశేషం.

ఇక హనుమాన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడే సుమారు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక హిందీలో రూ.42 కోట్ల కలెక్షన్లు దాటాయి. కన్నడ, తమిళ్‌, మలయాళంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా విదేశాల్లో హనుమాన్‌ బాగా  ఆడుతోంది. ఓవర్సీస్‌లో ఇప్పటికే టాప్‌ హీరోల సినిమాలకు పోటీగా వసూళ్లు రాబట్టి టాప్-5కు చేరుకుంది. హనుమాన్‌ సినిమాలో అమృతా అయ్యర్‌ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ మరో కీలక పాత్ర పోషించింది. వాన ఫేమ్‌ వినయ్‌ రాయ్‌ స్టైలిష్ విలన్‌గా కనిపించాడు.

ఇవి కూడా చదవండి

10 రోజుల్లోనే దిమ్మ తిరిగే వసూళ్లు..

ప్రేక్షకులతో ముఖాముఖి..

మరికొద్ది గంటల్లో ముగియనున్న ఆఫర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి