Sitara: మహేశ్‌ అడుగు జాడల్లోనే సితార .. అనాథ పిల్లలకు ‘గుంటూరు కారం’ స్పెషల్‌ షో.. లగ్జరీ స్క్రీన్‌లో..

మహేశ్‌ తన సొంతూరులో పలు అభివృద్ధి పనులు చేస్తున్నాడు .అలాగే మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ను నెలకొల్పి వేలాది మంది పేద చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నాడు. ఇప్పుడు సితార కూడా మహేశ్‌ బాటలోనే అడుగులు వేస్తోంది

Sitara: మహేశ్‌ అడుగు జాడల్లోనే సితార .. అనాథ పిల్లలకు 'గుంటూరు కారం' స్పెషల్‌ షో.. లగ్జరీ స్క్రీన్‌లో..
Sitara Ghattamaneni
Follow us
Basha Shek

|

Updated on: Jan 21, 2024 | 2:30 PM

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కుమార్తె సితార ఘట్టమనేని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్‌ కిడ్‌గా ఇప్పటికే హీరోయిన్లకు మించి క్రేజ్‌, పాపులారిటీ సొంతం చేసుకుందామె. సినిమాలు, టీవీషోల సంగతి పక్కన పెడితే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ తండ్రిక తగ్గ తనయగా గుర్తింపు తెచ్చుకుంటోంది సితార . మహేశ్‌ తన సొంతూరులో పలు అభివృద్ధి పనులు చేస్తున్నాడు .అలాగే మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ను నెలకొల్పి వేలాది మంది పేద చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నాడు. ఇప్పుడు సితార కూడా మహేశ్‌ బాటలోనే అడుగులు వేస్తోంది. కొన్ని నెలల క్రితం ఒక జ్యూవెలరీ యాడ్‌తో వచ్చిన రెమ్యునరేషన్‌ మొత్తం ఒక స్వచ్చంద సంస్థకు విరాళంగా అందజేసింది సితార. ఇక తన పుట్టిన రోజును కొందరు పేదింటి విద్యార్థులను ఇంటికి పిలుపించుకుని వారితో సరదాగా గడిపింది. వారితోనే కేక్‌ కట్ చేయించింది. అంతేకాదు తన పుట్టిన రోజు కానుకగా విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసింది. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకుందీ మహేశ్‌ కూతురు. తాజాగా అనాథ పిల్లలతో సరదాగా గడిపింది సితార. ఆ తర్వాత మహేశ్‌ నటించిన గుంటూరు కారం సినిమాను వారందరికీ ఉచితంగా చూపించింది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో స్పెషల్‌ షో ఏర్పాటు చేసింది. అక్కడ అత్యంత లగ్జరీ స్క్రీన్‌లో విద్యార్థులందరూ సినిమా చూసి ఎంజాయ్‌ చేసేలా ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఈ ఫొటోలను మహేశ్‌ బాబుతో పాటు పలువురు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. దీంతో అవి కాస్తా తెగ వైరలవుతున్నాయి. సితార చాలా మంచి పనిచేసిందంటూ అబిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అతడు, ఖలేజా వంటి హిట్స్‌ తర్వాత మహేశ్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూడో సినిమా గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. హారిని అండ్‌ హాసిని క్రియేష్స్‌ బ్యానర్‌పై ఎస్‌. రాధాకృష్ణ గుంటూరు కారం సినిమాను నిర్మించారు. రమ్యకృష్ణ, జయరాం, ఈశ్వరి రావు, మురళీ శర్మ, జగపతిబాబు, బ్రహ్మాజీ, అజయ్‌, రావు రమేశ్‌, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, సునీల్‌ తదితరులు గుంటూరు కారంలో ప్రధాన పాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే రూ.212 కోట్లు కలెక్ట్‌ చేసి మహేశ్ మ్యాజిక్ ఏంటో మరోసారి చూపించింది.

ఇవి కూడా చదవండి

థియేటర్ లో అనాథ పిల్లలతో మహేశ్ కూతురు..

మహేశ్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే