Shoaib Malik: సానియాతో కటీఫ్‌.. మరో పెళ్లి చేసుకున్నషోయబ్‌ మాలిక్‌.. అమ్మాయి ఎవరంటే?

పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ షాక్‌ ఇచ్చాడు. తన భార్య టీమిండియా టెన్నిస్‌ క్రీడాకారిణీ సానియా మీర్జాతో దూరంగా ఉంటోన్న అతను ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలెక్కాడు. పాకిస్తాన్‌కే చెందిన ప్రముఖ నటి సనా జావేద్‌తో కలిసి శనివారం నిఖా చేసుకున్నాడు

Shoaib Malik: సానియాతో కటీఫ్‌.. మరో పెళ్లి చేసుకున్నషోయబ్‌ మాలిక్‌.. అమ్మాయి ఎవరంటే?
Shoaib Malik Marriage
Follow us
Basha Shek

|

Updated on: Jan 20, 2024 | 12:54 PM

పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ షాక్‌ ఇచ్చాడు. తన భార్య టీమిండియా టెన్నిస్‌ క్రీడాకారిణీ సానియా మీర్జాతో దూరంగా ఉంటోన్న అతను మరోసారి పెళ్లి పీటలెక్కాడు. పాకిస్తాన్‌కే చెందిన ప్రముఖ నటి సనా జావేద్‌తో కలిసి శనివారం నిఖా చేసుకున్నాడు. గత కొంత కాలంగా వీరిద్దరూ రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో సానియాతో షోయబ్‌ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. అయితే వీటిపై ఎవరూ అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ సడెన్‌గా మరోసారి పెళ్లి చేసుకుని షాక్‌ ఇచ్చాడు షోయబ్‌. ఇందుకు సంబంధించిన ఫొటోలను షోయబ్‌ నే ట్విట్టర్‌ లో షేర్‌ చేసుకోవడం గమనార్హం. సానియాతో విడాకుల ప్రచారం సాగుతుండగానే షోయబ్‌, సనాల పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సానియా, షోయబ్‌లది కూడా ప్రేమ వివాహం. ఇద్దరూ 2010లో హైదరాబాద్‌లో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు, ఆ తర్వాత పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో వలీమా వేడుక చేసుకున్నారు. మాలిక్, సానియా మీర్జాలకు 2018లో ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు.

సనా జావేద్ తో షోయబ్ మాలిక్..

ఇవి కూడా చదవండి

సానియా మీర్జా తన కుమారుడితో దుబాయ్‌ లో ఉండిపోతే, షోయబ్‌ మాలిక్‌ మాత్రం ఎక్కువగా పాకిస్తాన్‌లోనే ఉంటున్నాడు. ఇటీవల కుమారుడి బర్త్‌ డే వేడుకల్లో పాల్గొన్పటికీ పలకరించుకున్న దాఖలాలు కూడా లేవు. తమ బంధంపై బయట ఏనాడు మాట్లాడని సానియా, షోయబ్‌ సోషల్‌ మీడియాలో మాత్రం క్రిప్టిక్‌ పోస్టులు షేర్‌ చేస్తూ ఉన్నారు. రెండు రోజుల క్రితం కూడా ‘పెళ్లి కష్టం.. విడాకులు ఇంకా కష్టం’ అంటూ సానియా పోస్ట్‌ షేర్‌ చేసింది. దీంతో వీరి విడాకుల వార్తలు మళ్లీ గుప్పుమన్నాయి. ఇప్పుడు ఏకంగా మరో పెళ్లి చేసుకుని షాక్‌ ఇచ్చాడు షోయబ్‌.

ముచ్చటగా మూడో పెళ్లి!!

కాగా ఇది షోయబ్‌ మాలిక్‌కి ఇది మూడో పెళ్లి అని తెలుస్తోంది. సానియాతో వివాహానికి ముందు, మాలిక్ అయేషా సిద్ధిఖీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి, అయితే ఈ పాక్‌ క్రికెటర్‌ ఈ వార్తలను ఖండిస్తూ వచ్చాడు.

మరోవైపు సనా జావేద్ కు ఇది రెండవ వివాహం. సనా జావేద్ గతంలో పాకిస్థానీ సింగర్ ఒమర్ జస్వాల్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. పెళ్లి కూడా చేసుకుందని తెలుస్తోంది. 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..