Fight Club OTT: ఓటీటీలోకి తమిళ సూపర్‌ హిట్‌ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎప్పుడంటే?

కోలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్లలో ఒకరైన లోకేశ్‌ కనగరాజ్ నిర్మాతగానూ సత్తా చాటారు. ఆయన నిర్మాతగా మారి రూపొందించిన మొదటి చిత్రం ఫైట్‌ క్లబ్. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్‌ కుమార్‌ హీరోగా నటించాడు. ఏ ర‌హ‌మ‌త్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఫైట్‌ క్లబ్‌లో మోనీషా మోహ‌న్ మీన‌న్ హీరోయిన్‌గా న‌టించింది

Fight Club OTT: ఓటీటీలోకి తమిళ సూపర్‌ హిట్‌ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎప్పుడంటే?
Fight Club Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 18, 2024 | 12:16 PM

కోలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్లలో ఒకరైన లోకేశ్‌ కనగరాజ్ నిర్మాతగానూ సత్తా చాటారు. ఆయన నిర్మాతగా మారి రూపొందించిన మొదటి చిత్రం ఫైట్‌ క్లబ్. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్‌ కుమార్‌ హీరోగా నటించాడు. ఏ ర‌హ‌మ‌త్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఫైట్‌ క్లబ్‌లో మోనీషా మోహ‌న్ మీన‌న్ హీరోయిన్‌గా న‌టించింది. డిసెంబర్‌ 15న విడుదలైన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఫైట్ క్ల‌బ్ ఇర‌వై కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లను సాధించింది. అలాగే తొమ్మిది కోట్ల‌కుపైగా షేర్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఫైట్‌ క్లబ్‌ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్ర‌వ‌రి 2న ఫైట్ క్ల‌బ్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్‌. తమిళ్‌తో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఫైట్‌ క్లబ్‌ను స్ట్రీమింగ్‌ చేయనున్నారు.

సినిమా నేపథ్యమిదే..

ఫైట్‌ క్లబ్‌ సినిమా కథ విషయానికి వస్తే.. గొప్ప ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా పేరుతెచ్చుకోవాల‌ని సెల్వ (విజ‌య్ కుమార్‌) క‌ల‌లు కంటాడు. అతనికి బెంజి అండదండలుంటాయి. అయితే బెంజీని అతని సోదరుడి జోసెఫ్ (అవినాష్ ర‌ఘుదేవ‌న్‌)తోనే చంపిస్తాడు రౌడీ కిర్బా (శంక‌ర్ థాస్‌). దీంతో జోసెఫ్ జైలుకు వెళతాడు. బెంజి చనిపోవడంతో జులాయిగా మారిపోతాడు సెల్వ. ఇదే సమయంలో జైలు నుంచి విడుదలైన జోసెఫ్‌ కిర్చా చేసిన మోసాన్ని గ్రహిస్తాడు. అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. జోసెఫ్‌, సెల్వల జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఫైట్ క్లబ్‌ మూవీ కథ. మంచి యాక్షన్ థ్రిల్లర్‌ మూవీస్‌ చూసేవారికి ఫైట్‌ క్లబ్‌ ఒక మంచి ఛాయిస్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?