Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: ‘అంత ప్రేమ ఉంటే ఫ్యాన్స్‌ను ఇంట్లోకి పిలిపించుకోండి’.. రజనీపై వృద్ధురాలి ఫైర్.. వీడియో

పుట్టిన రోజు, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో అభిమానులు రజనీ ఇంటి ముందు సందడి చేస్తుంటారు. తమ హీరోను ఒక్కసారైనా చూసి వెళ్లిపోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. తలైవా కూడా అభిమానులను నిరాశపర్చకుండా ఇంటి బయటకు వచ్చి అందరికీ అభివారం చేసి మాట్లాడుతుంటారు.

Rajinikanth: 'అంత ప్రేమ ఉంటే ఫ్యాన్స్‌ను ఇంట్లోకి పిలిపించుకోండి'.. రజనీపై వృద్ధురాలి ఫైర్.. వీడియో
Rajinikanth
Follow us
Basha Shek

|

Updated on: Jan 17, 2024 | 9:39 AM

సూపర్‌ స్టార్‌కు రజనీకాంత్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తమిళనాట అయితే తలైవాకు మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఉన్నారు. పుట్టిన రోజు, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో అభిమానులు రజనీ ఇంటి ముందు సందడి చేస్తుంటారు. తమ హీరోను ఒక్కసారైనా చూసి వెళ్లిపోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. తలైవా కూడా అభిమానులను నిరాశపర్చకుండా ఇంటి బయటకు వచ్చి అందరికీ అభివారం చేసేసి వెళ్లిపోతారు. సంక్రాంతి సందర్భంగా సోమవారం (జనవరి 15) కూడా రజనీ ఇంటి వద్ద ఇలాంటి పరిస్థితే నెలకొంది. చెన్నైలోని పోయెస్‌ గార్డ్‌లో సూపర్‌ స్టార్‌ ఇంటి ముంగిట ఉదయాన్నే వేలాది మంది అభిమానులు బారులు తీరారు. దీంతో ఎప్పటిలాగానే రజనీ బయటకు వచ్చి అభివాదం చేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నానన్నారు. నిబద్ధత, నిజాయతీతో నడుచుకోవాలని, అప్పుడే జీవితం ప్రశాంతంగా సాగుతుందని అభిమానులకు సూచించారు.

తమ అభిమాన హీరో బయటకు రావడం, తమల్ని పలకరించడంతో రజనీ ఫ్యాన్స్‌ పులకించిపోయారు. ‘ తలైవా తలైవా’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీంతో రజనీ ఇంటి చుట్టుపక్కల వాతావరణం సందడి సందడిగా మారిపోయింది. ఇదే రజనీకాంత్‌ పక్కింట్లో ఉండే ఒక ముసలావిడకు ఆగ్రహం తెప్పించింది. ‘ ఇదేం లొల్లి.. ప్రశాంతంగా పండగను కూడా సెలబ్రేట్‌ చేసుకోనివ్వరా’ అంటూ ఫైర్‌ అయ్యారు. అక్కడ ఉండే సెక్యూరిటీ సిబ్బంది, అభిమానులతో వాగ్వాదానికి దిగారు. ‘ఏం మీ (రజనీకాంత్‌) ఇంటి ద్వారాలు తెరిచి వారిని లోనికి పిలిపించుకోవచ్చుగా. మేం కూడా ఇంటి పన్ను కడుతున్నాం. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అభిమానులు ఇలా మా ఇంటి ముందు నిలబడి కేకలు వేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రశాంతంగా దేవుడిని కూడా ప్రార్థించలేకపోతున్నాం’ అంటూ మండిపడ్డారామె. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

అయోధ్య నుంచి రజనీకి అందిన ఆహ్వానం..

అమితాబ్ తో రజనీకాంత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ధోని ఫినిషింగ్ టచ్‌కు భారీ గిఫ్ట్.. 43 ఏళ్లవయసులో రికార్డు
ధోని ఫినిషింగ్ టచ్‌కు భారీ గిఫ్ట్.. 43 ఏళ్లవయసులో రికార్డు
భయపెడుతున్న టైప్ 5 డయాబెటిస్.. వారికే ఎక్కువ రిస్క్
భయపెడుతున్న టైప్ 5 డయాబెటిస్.. వారికే ఎక్కువ రిస్క్
మ్యాడ్ మాక్సీ తుస్సుమనిపించాడు.. ఇక గెట్ అవుట్ ప్లీజ్
మ్యాడ్ మాక్సీ తుస్సుమనిపించాడు.. ఇక గెట్ అవుట్ ప్లీజ్
అదిరే ఫీచర్లతో గ్రాండ్‌ విటారా నయా వెర్షన్‌.. ధర ఎంతో తెలిస్తే షా
అదిరే ఫీచర్లతో గ్రాండ్‌ విటారా నయా వెర్షన్‌.. ధర ఎంతో తెలిస్తే షా
గురు దృష్టితో అదృష్ట యోగాలు.. ఆ రాశుల వారి దశ తిరగడం పక్కా..!
గురు దృష్టితో అదృష్ట యోగాలు.. ఆ రాశుల వారి దశ తిరగడం పక్కా..!
మాక్స్‌వెల్‌ ను ఇప్పుడే పక్కనపెట్టాలన్న కీవిస్ మాజీ ప్లేయర్
మాక్స్‌వెల్‌ ను ఇప్పుడే పక్కనపెట్టాలన్న కీవిస్ మాజీ ప్లేయర్
ఎన్టీఆర్ ఎందుకు సన్నగా అయ్యారు.. ? కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఇదే..
ఎన్టీఆర్ ఎందుకు సన్నగా అయ్యారు.. ? కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఇదే..
HYDలో సిటిజెన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి
HYDలో సిటిజెన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి
నడిరోడ్డుపైనే మహిళపై అత్యంత అమానుషంగా..!
నడిరోడ్డుపైనే మహిళపై అత్యంత అమానుషంగా..!
శక్తి కావాలంటే, ఉత్సాహంగా ఉండాలంటే వీటిని తినాల్సిందే..!
శక్తి కావాలంటే, ఉత్సాహంగా ఉండాలంటే వీటిని తినాల్సిందే..!