AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman: బాక్సాఫీస్‌ వద్ద ‘హనుమాన్‌’ ప్రభంజనం.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్‌ చేసిందో తెలుసా?

హనుమాన్‌ బాక్సాఫీస్‌ దుమ్ముదులుపుతున్నాడు. స్టార్‌ హీరోల సినిమాలో పోటీ పడి మరీ రికార్డు స్థాయి వసూల్లు సాధిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లకు చేరువ కావడం విశేషం. కేవలం రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్‌ ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ను అధిగమించింది

Hanuman: బాక్సాఫీస్‌ వద్ద 'హనుమాన్‌' ప్రభంజనం.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్‌ చేసిందో తెలుసా?
Hanuman Movie
Basha Shek
|

Updated on: Jan 16, 2024 | 12:51 PM

Share

హనుమాన్‌ బాక్సాఫీస్‌ దుమ్ముదులుపుతున్నాడు. స్టార్‌ హీరోల సినిమాలో పోటీ పడి మరీ రికార్డు స్థాయి వసూల్లు సాధిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లకు చేరువ కావడం విశేషం. కేవలం రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్‌ ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ను అధిగమించింది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లన్నీ లాభాల కిందే లెక్క. ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన హనుమాన్‌ మూవీలో తేజ సజ్జా హీరోయిన్‌గా నటించాడు. అమృతా అయ్యర్‌ కథానాయికగా మెరిసింది. వరలక్ష్మీ శరత్ కుమార్‌, వినయ్‌ రామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బరిలో స్టార్‌ హీరోల సినిమాలు ఉన్నా, థియేటర్లు పరిమిత సంఖ్యలోనే దొరికినా పాజిటివ్‌ టాక్‌ రావడంతో వసూళ్లలో దూసుకుపోతోంది హనుమాన్‌. చాలా చోట్ల ఈ మూవీ టికెట్లు దొరకడం గగనంగా మారిపోయింది. ఇక నాలుగో రోజైన సోమవారం (జనవరి 15) హనుమాన్‌ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.11 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అంటే మొదటి రోజు వసూళ్ల కంటే ఇది రెట్టింపు. సంక్రాంతితో పాటు వరుసగా సెలవులు రావడం హనుమాన్‌ జోరుకు కారణమని చెప్పుకోవచ్చు.

ఓవర్సీస్ లోనూ..

మొదటి వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా రూ.73 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన హనుమాన్.. నాలుగో రోజు మరో రూ.24 కోట్లతో మొత్తంగా రూ.97 కోట్ల గ్రాస్ సాధించింది. మంగళవారం కూడా సెలవు రోజు కాబట్టి హనుమాన్‌ వంద కోట్లు దాటి మరిన్ని రికార్డులు అధిగమిస్తుందనడంలో సందేహం లేదు. హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. అక్కడ 4 రోజుల్లో 3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తద్వారా నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు సినిమాల్లో ఒకటిగా హనుమాన్ స్థానం సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి

నార్త్ లోనూ అదరగొడుతోన్న హనుమాన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Vaibhav Suryavanshi: కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బుడ్డోడు..
Vaibhav Suryavanshi: కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బుడ్డోడు..
మెగాస్టార్ 'హుక్‌స్టెప్‌' పాటకు బామ్మ‌ల స్టెప్పులు.. వీడియో ఇదిగో
మెగాస్టార్ 'హుక్‌స్టెప్‌' పాటకు బామ్మ‌ల స్టెప్పులు.. వీడియో ఇదిగో
ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి
ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి
ప్రభాస్ నుండి శర్వానంద్ వరకు.. 2026 పండుగ విజేతలు వీరే!
ప్రభాస్ నుండి శర్వానంద్ వరకు.. 2026 పండుగ విజేతలు వీరే!
సందీప్ రెడ్డి వంగా పేరు చెబితే ఎమోషనల్ అవుతున్న ఆ నటుడు...
సందీప్ రెడ్డి వంగా పేరు చెబితే ఎమోషనల్ అవుతున్న ఆ నటుడు...
సినిమా రేంజ్‌ మిస్టరీ.. తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కాల్..
సినిమా రేంజ్‌ మిస్టరీ.. తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కాల్..
తమిళనాడు ఎన్నికల్లో పోటీకి హీరో విజయ్ సిద్దం.. కీలక స్టెప్
తమిళనాడు ఎన్నికల్లో పోటీకి హీరో విజయ్ సిద్దం.. కీలక స్టెప్
సమోసాలతో సంపాదన.. ఇంటి నుంచే కాలు కదపకుండా ప్రతీ నెల..
సమోసాలతో సంపాదన.. ఇంటి నుంచే కాలు కదపకుండా ప్రతీ నెల..
టాలీవుడ్‌లో ఫేవరెట్ హీరో ఎవరో చెప్పి షాక్ ఇచ్చిన యంగ్ బ్యూటీ
టాలీవుడ్‌లో ఫేవరెట్ హీరో ఎవరో చెప్పి షాక్ ఇచ్చిన యంగ్ బ్యూటీ
IPL 2026: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్..
IPL 2026: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్..