Guntur Kaaram: సైబర్ పోలీసులను ఆశ్రయించిన మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’ టీమ్‌.. కారణమిదే

సూపర్‌ హిట్‌ టాక్‌ తో దూసుకెళుతోన్న గుంటూరు కారం రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వరుసగా సంక్రాంతి సెలవులు ఉండడంతో రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉందంటున్నారు మేకర్స్‌. అయితే గుంటూరు కారం సినిమాపై కొందరు నెగెటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ చేస్తున్నారని చిత్ర బృందం ఆరోపిస్తోంది

Guntur Kaaram: సైబర్ పోలీసులను ఆశ్రయించిన మహేశ్‌ బాబు 'గుంటూరు కారం' టీమ్‌.. కారణమిదే
Guntur Kaaram Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 15, 2024 | 10:21 AM

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన ఈ పక్కా కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్లలో రిలీజైంది. ఇందులో లేటెస్ట్‌ సెన్సేషన్‌ శ్రీలీల హీరోయిన్‌ గా నటించగా, మీనాక్షి చౌదరి మహేశ్‌ మరదలి పాత్రలో మెప్పించింది. సూపర్‌ హిట్‌ టాక్‌ తో దూసుకెళుతోన్న గుంటూరు కారం రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వరుసగా సంక్రాంతి సెలవులు ఉండడంతో రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉందంటున్నారు మేకర్స్‌. అయితే గుంటూరు కారం సినిమాపై కొందరు నెగెటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ చేస్తున్నారని చిత్ర బృందం ఆరోపిస్తోంది. ఇదే విషయమై వారు సైబర పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రముఖ థియేటర్‌ బుకింగ్‌ యాప్‌ బుక్‌ మై షోలో మహేశ్‌ బాబు సినిమాకు తక్కువ రేటింగ్ రావడం, అలాగే కేవలం 70 వేల ఓట్లే పడడంపై ఆరా తీయాలని సైబర్‌ పోలీసులను కోరినట్లు సమాచారం. ఫేక్‌ ఓటింగ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.

హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించిన గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ, జయరాం, ఈశ్వరి రావు, ప్రకాశ్‌ రాజ్‌, జయరాం, రఘుబాబు, రావు రమేశ్, రాహుల్‌ రవీంద్రన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థమన్‌ అందించిన స్వరాలు చార్ట్‌ బస్టర్‌ గా నిలిచాయి. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా ఉండడంతో మహేశ్‌ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు కూడా గుంటూర కారం మూవీని చూసేందుకు క్యూ కడుతున్నారు. అదే సమయంలో నెగెటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అవ్వడం చిత్ర బృందాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

ఇవి కూడా చదవండి

100 కోట్లు దాటేసిందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం