AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashanth Varma: ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు.. ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్

సంక్రాంతి బరిలో నిలిచినా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిజమ పై చిత్రయూనిట్ మొదటి నుంచి గాట్టి నమ్మకంతో ఉంది. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపారు. మహేష్ బాబు గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ లాంటి సినిమాలు బరిలో ఉన్న కుడా వెనకాదు వేయకుండా సినిమాను రిలీజ్ చేశారు.

Prashanth Varma: ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు.. ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్
Prasanth Varma
Rajeev Rayala
|

Updated on: Jan 16, 2024 | 1:48 PM

Share

చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది హనుమాన్ . ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా సూపర్ హిట్ గా అయ్యింది. ఈ సినిమా పై చిత్రయూనిట్ మొదటి నుంచి గాట్టి నమ్మకంతో ఉంది. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపారు. మహేష్ బాబు గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ లాంటి సినిమాలు బరిలో ఉన్నా కుడా వెనకాడు వేయకుండా సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

హనుమాన్ సినిమాకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. మొదటి రోజు ఈ సినిమాకు తక్కువ థియేటర్స్ లభించినా ఇప్పుడు ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో థియేటర్స్ పెరిగాయి. ఇక ఈసినిమా బడ్జెట్ 50 కోట్లతో తెరకెక్కినా కూడా హాలీవుడ్ రేంజ్ లో వీఎఫ్ఎక్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ తో పాటు భారీగా కలెక్షన్స్‌ను కూడా సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు’అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.