AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman: హనుమాన్‌ సినిమాను చూసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. రివ్యూ ఏమిచ్చారో తెలుసా?

సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైన హనుమాన్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. అతి తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన విజువల్స్‌ తో హనుమాన్‌ సినిమాను తెరకెక్కించారంటూ చిత్ర బృందంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రామ్‌ గోపాల్‌ వర్మ, సాయి ధరమ తేజ్ వంటి సినీ ప్రముఖులు హనుమాన్‌ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా టాలీవుడ్‌ దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు హనుమాన్ సినిమాను వీక్షించారు.

Hanuman: హనుమాన్‌ సినిమాను చూసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. రివ్యూ ఏమిచ్చారో తెలుసా?
Director Raghavendra Rao
Basha Shek
|

Updated on: Jan 15, 2024 | 9:35 AM

Share

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్‌ హీరో తేజా సజ్జా నటించిన సినిమా హనుమాన్‌. మన దేశంలో రిలీజైన మొదటి సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ మూవీ ఇదే కావడం విశేషం. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైన హనుమాన్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. అతి తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన విజువల్స్‌ తో హనుమాన్‌ సినిమాను తెరకెక్కించారంటూ చిత్ర బృందంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రామ్‌ గోపాల్‌ వర్మ, సాయి ధరమ తేజ్ వంటి సినీ ప్రముఖులు హనుమాన్‌ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా టాలీవుడ్‌ దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు హనుమాన్ సినిమాను వీక్షించారు. అనంతరం తేజ సజ్జా సినిమాపై ట్విట్టర్‌ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘సంక్రాంతి పండగ వేళ వచ్చిన హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చాలా సంతోషం గా ఉంది. ఈ చిత్రంలో హీరో తేజ సజ్జా నటన, ప్రశాంత్ వర్మ దర్శకత్వం, విజువల్‌గా చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు’ అని తెలుగులో ట్వీట్‌ చేశారు రాఘవేంద్ర రావు.

సూపర్‌ హీరో కాన్సెప్ట్‌కు రామాయణం ఇతిహాసాన్ని జోడించి ప్రశాంత్‌ వర్మ హనుమాన్‌ సినిమాను తెరకెక్కించాడు. సంక్రాంతి బరిలో మహేశ్‌, వెంకటేశ్‌, నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాలున్నా కంటెంట్‌పై స్ట్రాంగ్‌ గా నమ్మకం ఉండడంతో హనుమాన్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌ .అందుకు తగ్గట్టుగానే మిగతా సినిమాల కంటే ముందు వరుసలో దూసుకెళుతోంది హనుమాన్‌. ఇందులో అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ హీరో సోదరి పాత్రలో మెరిసింది. వాన ఫేమ్‌ వినయ్‌ రాయ్‌ స్టైలిష్‌ విలన్ గా మెప్పించాడు.అలాగే రాజ్‌ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌, సముద్ర ఖని, గెటప్‌ శీను, సత్య, రోహిణీ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో అదనపు షోస్..

రెండు రోజుల్లో 10 లక్షల టికెట్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.