AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: మాల్దీవులు నాకు ఇష్టమైన ప్లేస్‌.. వెకేషన్‌కు టికెట్లు బుక్ చేసుకున్నా.. కానీ: కింగ్‌ నాగార్జున

ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు వెటకారంగా మాట్లాడారు. దీంతో వెంటనే బాయ్‌ కాట్‌ మాల్దీవ్స్ అనే నినాదం బాగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. మాల్దీవుల పర్యటనను క్యాన్సిల్‌ చేసుకుంటున్నామని, ఆ స్థానంలో లక్ష ద్వీప్‌కు వెళుతున్నామని ప్రకటిస్తున్నారు.

Nagarjuna: మాల్దీవులు నాకు ఇష్టమైన ప్లేస్‌.. వెకేషన్‌కు టికెట్లు బుక్ చేసుకున్నా.. కానీ: కింగ్‌ నాగార్జున
Nagarjuna
Basha Shek
|

Updated on: Jan 14, 2024 | 8:26 PM

Share

ఈ ఏడాది సంక్రాంతికి ‘నా సామిరంగ’ అంటూ మనల్ని పలకరించేందుకు వచ్చేశారు అక్కినేని అందగాడు కింగ్‌ నాగార్జున. విజయ్‌ బిన్నీ తెరకెక్కించిన ఈ మూవీలో అమిగోస్‌ బ్యూటీ ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రలు పోషించారు. శనివారం (జనవరి 14)న రిలీజైన నా సామిరంగకు పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ నాగ్‌ మూవీపై బాగా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ షో, వరుస సినిమాలతో బిజీగా గడిపిన నాగార్జున రిలాక్సేషన్‌కు మాల్దీవుల వెకేషన్‌కు ప్లాన్‌ చేసుకున్నారు. అయితే ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు వెటకారంగా మాట్లాడారు. దీంతో వెంటనే బాయ్‌ కాట్‌ మాల్దీవ్స్ అనే నినాదం బాగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. మాల్దీవుల పర్యటనను క్యాన్సిల్‌ చేసుకుంటున్నామని, ఆ స్థానంలో లక్ష ద్వీప్‌కు వెళుతున్నామని ప్రకటిస్తున్నారు. ఇందులో పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారు .తాజాగా ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు నాగార్జున. ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన కింగ్‌ తన వెకేషన్‌ టికెట్లను క్యాన్సిల్‌ చేసుకుంటున్నట్లు తెలిపారు.

‘అటు బిగ్‌బాస్‌ ఇటు సినిమాలతో 75 రోజుల పాటు షూటింగులతో ఫుల్ బిజీగా గడిపాను. అందుకే సంక్రాంతి ఫెస్టివల్‌ తర్వాత 17,18 తేదీల్లో మాల్దీవుల వెకేషన్‌కు వెళదామని టికెట్లు బుక్ చేసుకున్నా. నాకు బాగా ఇష్టమైన ప్లేస్. అయితే మన ప్రధాన మంత్రి మోడీపై వాళ్లు చేసిన కామెంట్లను చూసి వెంటనే టికెట్లను క్యాన్సిల్‌ చేశాను. అంతే కానీ.. నేను భయంతో టికెట్లు రద్దు చేసుకోలేదు. వాళ్లు చేసింది ఏ మాత్రం కరెక్ట్ కాదు. సుమారు 150 కోట్ల మంది ప్రజలకు నాయకుడిగా ఉన్న మన ప్రధాని పట్ల మాల్దీవుల మంత్రులు వ్యవహరించిన తీరు సరైంది కాదు. యాక్షన్‌కు రియాక్షన్‌ కచ్చితంగా ఉంటుంది. ఇప్పటి నుంచి లక్షద్వీప్‌లోని ఐల్యాండ్స్ కు వెళదాం’ అని పిలుపు నిచ్చారు నాగార్జున. దీంతో సరైన నిర్ణయం తీసుకున్నారంటూ కింగ్‌ పై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నా సామిరంగా సక్సెస్ పై నాగ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!