AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhruv Jurel: నాన్న క్రికెట్ మానేయమన్నాడు.. అమ్మ బంగారు గొలుసు అమ్మి క్రికెట్‌ కిట్‌ కొన్నా: ధ్రువ్ జురేల్

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడేందుకు భారత జట్టు సిద్ధమైంది. తొలి రెండు మ్యాచ్‌లకు జట్టును కూడా ప్రకటించారు. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, 22 ఏళ్ల ధ్రువ్ జురెల్‌కు టీమ్ ఇండియా నుంచి పిలుపు రావడం. రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌ తరఫున ఆడుతున్న ధ్రువ్ జురెల్‌ను మూడో వికెట్‌కీపర్‌గా జట్టులోకి తీసుకున్నారు. ఇషాన్ కిషన్ ను కాదని సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి ధ్రువ్ కు ప్రాధాన్యమిచ్చారు

Dhruv Jurel: నాన్న క్రికెట్ మానేయమన్నాడు.. అమ్మ బంగారు గొలుసు అమ్మి క్రికెట్‌ కిట్‌ కొన్నా: ధ్రువ్ జురేల్
Dhruv Jurel
Basha Shek
|

Updated on: Jan 13, 2024 | 1:39 PM

Share

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడేందుకు భారత జట్టు సిద్ధమైంది. తొలి రెండు మ్యాచ్‌లకు జట్టును కూడా ప్రకటించారు. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, 22 ఏళ్ల ధ్రువ్ జురెల్‌కు టీమ్ ఇండియా నుంచి పిలుపు రావడం. రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌ తరఫున ఆడుతున్న ధ్రువ్ జురెల్‌ను మూడో వికెట్‌కీపర్‌గా జట్టులోకి తీసుకున్నారు. ఇషాన్ కిషన్ ను కాదని సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి ధ్రువ్ కు ప్రాధాన్యమిచ్చారు. దీంతో అతని గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత కూడా చాలామందికి ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు 22 ఏళ్ల ధ్రువ్ జురెల్‌. అందులో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అదేంటంటే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న జురేల్‌ టోర్నమెంట్ ఆడేందుకు క్రికెట్‌ కిట్‌ కావాలని వాళ్ల నాన్నను అడిగాడట. అయితే వారి వద్ద అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో తండ్రి క్రికెట్‌ మానేయమన్నాడట. అయితే బిడ్డ మనసును అర్థం చేసుకున్న తల్లి మాత్రం తన బంగారు గొలుసును విక్రయించి మరీ ధృవ్ జురెల్‌కు మొదటి క్రికెట్‌ కిట్‌ను కొనించింది. ధ్రువ్ జురెల్‌ది ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సొంత గ్రాం. అతని తండ్రి సైన్యంలో హవల్దార్‌ గా పనిచేవాడు. ధ్రువ్‌ కూడా తండ్రి బాటలోనే సైన్యంలో చేరాలనుకున్నాడు. అలాగే అతని తండ్రి కూడా ధ్రువ్‌ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనుకున్నాడు. అయితే ధృవ్‌ మాత్రం క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాడు.తండ్రికి తెలియకుండా క్రికెట్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాడు.

తన తండ్రి పదవీ విరమణ తర్వాత తమ కుటుంబ పరిస్థితి బాగా దిగజారిపోయిందన్నాడు ధ్రువ్‌. అటువంటి పరిస్థితిల్లోనే క్రికెట్‌పై మరింత దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అన్నీ అడ్డంకులను, ఇబ్బందులను అధిగమించి ఐపీఎల్‌లో అవకాశం సంపాదించాడు. అదే సమయంలో దేశవాళీ క్రికెట్‌లోనూ మంచి ప్రదర్శన చేశాడు. ఇప్పుడు ఏకంగా భారత జట్టు నుంచే పిలుపు వచ్చింది. ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ఎంపికైనప్పుడు స్నేహితులే ధ్రువ్‌కు మొదట సమాచారం అందించారు. ఎందుకంటే అతను ఇండియా A మ్యాచ్‌లో బిజీగా ఉన్నాడు. 22 ఏళ్ల ధ్రువ్‌కు ఇప్పుడు టీమిండియాలో ఆడే అవకాశం లభించనుంది. అతను ఇక్కడ అరంగేట్రం చేసే అవకాశం ఉన్నా, లేకపోయినా సీనియర్‌ క్రికెటర్లతో కలిసి ఉంటాడు. క్రికెట్‌లో మరిన్ని మెలకువలు నేర్చుకుంటాడు. భవిష్యత్‌లో మేటి క్రికెటర్‌గా ఎదగడానికి ఇదెంతో సహకరిస్తుంది.

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీతో ధ్రువ్ జురేల్..