Guess The Actor: కామన్‌ మ్యాన్‌లా మెట్రోలో ప్రయాణించిన స్టార్‌ హీరో.. ఫ్యాన్స్‌ ఫిదా.. ఎవరో గుర్తుపట్టారా?

నో స్టార్‌ డమ్‌.. నో హంగామా.. ఒక కామన్‌ మ్యాన్‌లా మెట్రో ట్రైన్‌ లో ప్రయాణిస్తోన్న ఈ స్టార్‌ హీరోను గుర్తు పట్టారా? అతనికి దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇతని స్పెషాలిటీ ఏంటంటే.. వేగంగా సినిమాలు పూర్తి చేయడం.. ఒక ఏడాదిలో కనీసం అరడజను సినిమాలైనా రిలీజ్‌ చేస్తాడు. లవ్‌, రొమాన్స్‌, కామెడీ, యాక్షన్‌, థ్రిల్లర్‌ .. ఇలా ఏ జానర్‌ కథల్లోనైనా ఇట్టే ఇమిడిపోతాడీ హీరో.

Guess The Actor: కామన్‌ మ్యాన్‌లా మెట్రోలో ప్రయాణించిన స్టార్‌ హీరో.. ఫ్యాన్స్‌ ఫిదా.. ఎవరో గుర్తుపట్టారా?
Actor
Follow us
Basha Shek

|

Updated on: Jan 12, 2024 | 1:29 PM

నో స్టార్‌ డమ్‌.. నో హంగామా.. ఒక కామన్‌ మ్యాన్‌లా మెట్రో ట్రైన్‌ లో ప్రయాణిస్తోన్న ఈ స్టార్‌ హీరోను గుర్తు పట్టారా? అతనికి దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇతని స్పెషాలిటీ ఏంటంటే.. వేగంగా సినిమాలు పూర్తి చేయడం.. ఒక ఏడాదిలో కనీసం అరడజను సినిమాలైనా రిలీజ్‌ చేస్తాడు. లవ్‌, రొమాన్స్‌, కామెడీ, యాక్షన్‌, థ్రిల్లర్‌ .. ఇలా ఏ జానర్‌ కథల్లోనైనా ఇట్టే ఇమిడిపోతాడీ హీరో. సినిమా ఇండస్ట్రీలో ఫుల్‌ క్రేజ్‌ ఉన్నా ఎంతో సింపుల్‌గానే ఉంటాడీ హీరో. అందుకే అతనికి అశేష అభిమానగణం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి తన సింప్లిసిటిని చాటుకున్నాడు. ఒక కామన్‌ మ్యాన్‌ లాగా మెట్రోలో ప్రయాణించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు సదరు హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే సమాధానం చెప్పేయమంటారా? అతను మరెవరో కాదు బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌. గురువారం (జనవరి 11) ప్రముఖ నిర్మాత దినేశ్‌ విజన్‌ తో కలిసి మెట్రోలో జర్నీ చేశారు అక్షయ్‌. బ్లాక్ డ్రెస్‌ ధరించిన ఆయన అందుకు తగ్గట్టుగా మ్యాచింగ్ టోపీని పెట్టుకున్నాడు. అలాగే ముఖానికి మాస్క్‌ పెట్టుకోవడంతో ఎవరూ అతనిని గుర్తుపట్టలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్యన సక్సెస్‌ రేస్‌లో బాగా వెనకబడ్డాడు అక్షయ్‌. గతేడాది సెల్ఫీ, ఓమైగాడ్‌ 2, మిషన్‌ రాణిగంజ్‌ అనే సినిమాల్లో నటించాడు. అయితే ఇందులో ఓ మై గాడ్‌2 మాత్రమే హిట్‌ అయ్యింది. మిగతా రెండు సినిమాలు ఫ్యాన్స్‌ను నిరాశపర్చాయి. ప్రస్తుతం ఆకాశమే హద్దురా హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడీ సీనియర్‌ హీరో. అలాగే బడేమియా, చోటే మియాలోనూ అక్షయ్‌నే హీరో. వీటితో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి.

మెట్రో ట్రైన్ లో హీరో అక్షయ్ కుమార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..