Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahalakshmi: ఐసీయూలో నటి మహాలక్ష్మి భర్త.. ఆక్సిజన్‌ ట్యూబుతో నిర్మాత రవీందర్.. అసలేమైందంటే? వీడియో

ఎన్ని కష్టాలొచ్చినా అన్యోన్యంగా కాపురం చేస్తున్నారీ లవ్లీ కపుల్‌. ఇదిలా ఉంటే ప్రస్తుతం యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడు రవీందర్. తమిళ బిగ్‌ బాస్‌ సీజన్‌పై తనదైన శైలిలో రివ్యూలుఇస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రవీందర్‌ తన యూట్యూబ్‌లో చేసిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో ఆయన ఆక్సిజన్‌ ట్యూబ్‌తో కనిపించడమే దీనికి కారణం.

Mahalakshmi: ఐసీయూలో నటి మహాలక్ష్మి భర్త.. ఆక్సిజన్‌ ట్యూబుతో నిర్మాత రవీందర్.. అసలేమైందంటే? వీడియో
Mahalakshmi, Ravindar Chandrasekaran
Follow us
Basha Shek

|

Updated on: Jan 11, 2024 | 8:28 PM

కోలీవుడ్‌ బుల్లితెర నటి మహా లక్ష్మి, ప్రముఖ నిర్మాత రవీందర్‌ చంద్రశేఖరన్‌ల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతేడాది పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నారీ లవ్లీ కపుల్‌. పెళ్లైనప్పుడు నెట్టింట వీరి గురించే చర్చ. మహాలక్ష్మీ డబ్బు కోసమే నిర్మాత రవీందర్‌ను పెళ్లి చేసుకుందని, అలాగే మహాలక్ష్మి లాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రవీందర్ ఎన్నో ట్రిక్కులు వేశాడని సామాజిక మాధ్యమాల్లో భారీగా ట్రోల్స్‌ వచ్చాయి. ఆ తర్వాత రవీందర్‌ ఛీటింగ్‌ కేసులో జైలుకు వెళ్లడం, అలాగే మహాలక్ష్మి కూడా అతనితో విడాకులు తీసుకుంటుందని ప్రచారం సాగింది. అయితే ఇలాంటి విమర్శలను అసలు పట్టించుకోవడం లేదు మహాలక్ష్మి, రవీందర్‌ దంపతులు. ఎన్ని కష్టాలొచ్చినా అన్యోన్యంగా కాపురం చేస్తున్నారీ లవ్లీ కపుల్‌. ఇదిలా ఉంటే ప్రస్తుతం యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడు రవీందర్. తమిళ బిగ్‌ బాస్‌ సీజన్‌పై తనదైన శైలిలో రివ్యూలుఇస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రవీందర్‌ తన యూట్యూబ్‌లో చేసిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో ఆయన ఆక్సిజన్‌ ట్యూబ్‌తో కనిపించడమే దీనికి కారణం. అనారోగ్య పరిస్థితుల్లోనూ ఆయన బిగ్‌ బాస్‌ సీజన్‌పై రివ్యూలు ఇవ్వడం విశేషం.

అయితే ముఖానికి ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకున్నారెందుకు అని కొందరు అడగ్గా.. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదన్నా రవీందర్‌. ‘ ఈ మధ్యన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బందిగా ఉంటోంది. వారం రోజులుగా ఐసీయూలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాను. త్వరలోనే నా ఆరోగ్యం కుదుటపడుతుంది. మళ్లీ మీ ముందుకు వస్తాను’ అని నిర్మాత  రవీందర్‌ చెప్పుకొచ్చారు. అయితే ఆరోగ్యం సహకరించనప్పుడు కూడా ఇలాంటి వీడియోలెందుకు చేయడం ? అని కొందరు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.  ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. అదే సమయంలో మహాలక్ష్మి ఎక్కడంటూ కొందరు నెటిజన్లు అడుగుతున్నారు. మొత్తానికి తన సొంత యూట్యూబ్‌ ఛానెల్ లో రవీందర్‌ షేర్‌ చేస్తోన్న వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రిలో మహాలక్ష్మి భర్త.. వీడియో ఇదిగో..

భర్త రవీందర్ తో నటి మహాలక్ష్మి

భర్తకు బర్త్ డే గిఫ్ట్ గా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.