- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss 7 Telugu Fame Ashwini Sree Revelas About Her Future Husband Qualities
Bigg Boss Ashwini Sree: ‘డబ్బులొద్దు.. అందమొద్దు.. అదొక్క గుణముంటే చాలు’.. కాబోయే భర్త గురించి అశ్విని శ్రీ
బిగ్ బాస్ ఏడో సీజన్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో అశ్విని శ్రీ ఒకరు. ఐదో వారంలో వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల తార 12 వారం ఎలిమినేట్ అయ్యింది. హౌజ్‌లో పెద్దగా టాస్కులు, గేమ్స్ ఆడకున్నా తన అందం, ఛార్మింగ్ లుక్స్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకుందీ అందాల తార.
Updated on: Jan 10, 2024 | 1:52 PM

బిగ్ బాస్ ఏడో సీజన్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో అశ్విని శ్రీ ఒకరు. ఐదో వారంలో వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల తార 12 వారం ఎలిమినేట్ అయ్యింది. హౌజ్‌లో పెద్దగా టాస్కులు, గేమ్స్ ఆడకున్నా తన అందం, ఛార్మింగ్ లుక్స్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకుందీ అందాల తార.

బిగ్ బాస్ లోకి రాకముందు పలు తెలుగు సినిమాల్లో నటించింది అశ్విని శ్రీ. పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, రవితేజ రాజా ది గ్రేట్ వంటి హిట్ సినిమాల్లో తళుక్కున మెరిసింది. అయితే పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు అశ్విని శ్రీకి పెళ్లయిందని వార్తలు వచ్చాయి. భర్తతో విడాకులు కూడా తీసుకుందని ప్రచారం జరిగింది. అయితే వీటిని మరోసారి కొట్టిపారేసిందీ సొగసరి.

ఈ సందర్భంగా తాను సింగిల్ అని చెప్పుకొచ్చిన అశ్విని శ్రీ తనకు కాబోయే భర్తలో ఉండే లక్షణాల గురించి ఓపెన్ అయ్యింది. తనకు చేసుకోబేయవాడికి అందం లేకపోయినా, డబ్బులు లేకపోయినా పర్లేదు. మంచి హార్ట్ ఉంటే చాలు అని ఫ్యూచర్ హజ్బెండ్ క్వాలిటీస్ గురించి చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

' డబ్బులు లేకపోయినా.. అందం లేకపోయినా.. ఏం లేకపోయినా పర్లేదు. నన్ను చేసుకోబోయే వాడికి మంచి హార్ట్ ఉంటే చాలు.. నన్ను బాగా చూసుకోవాలి.. అలాంటి వాడినే నేను చూసుకుంటా' అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది అశ్విని శ్రీ.

'నేను సింగిల్.. బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరు.. అయితే చాలామంది నాకు దగ్గర కావడానికి ట్రై చేశారు.. కానీ నాకు కూడా నచ్చాలి కదా.. అమ్మాయి అన్నాక ఎవడొకడు వెంటపడుతుంటాడు.. అందులోనూ నాలాంటి అమ్మాయి వెంట పడకుండా ఉంటారా?. అయితే నా మనసుకు నచ్చాలి కదా' అని తన గురించి సెల్ఫ డబ్బా కొట్టేసుకుందీ అమ్మడు.




