- Telugu News Photo Gallery Cinema photos King Nagarjuna's Naa Saami Ranga Trailer Huge Response Telugu Heroes Photos
Naa Saami Ranga: ఏది ఏమైనా సంక్రాంతి బరిలోనే కింగ్ నాగ్.! ఈసారి పండక్కి నా సామి రంగ..
సంక్రాంతి బరిలో సోగ్గాడి ఎంట్రీ అన్నది రివాజుగా మారిపోయింది. సోగ్గాడే చిన్నినాయన సినిమాతో సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు నాగ్. అప్పటి నుంచి ఈ సీజన్‌ను సెంటిమెంట్ భావిస్తున్న అక్కినేని స్టార్, ఈ సారి కూడా అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తున్నారు. షూటింగ్ స్టేటస్, ఇతర బిజీలను కూడా పట్టించుకోకుండా పెద్ద పండక్కు బరిలో దిగాల్సిందే అని పట్టుబట్టి పని చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో అందరికంటే లేట్‌గా డేట్ లాక్ చేసిన హీరో కింగ్ నాగార్జున.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Jan 10, 2024 | 4:44 PM

సంక్రాంతి బరిలో సోగ్గాడి ఎంట్రీ అన్నది రివాజుగా మారిపోయింది. సోగ్గాడే చిన్నినాయన సినిమాతో సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు నాగ్. అప్పటి నుంచి ఈ సీజన్‌ను సెంటిమెంట్ భావిస్తున్న అక్కినేని స్టార్, ఈ సారి కూడా అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తున్నారు.

షూటింగ్ స్టేటస్, ఇతర బిజీలను కూడా పట్టించుకోకుండా పెద్ద పండక్కు బరిలో దిగాల్సిందే అని పట్టుబట్టి పని చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో అందరికంటే లేట్‌గా డేట్ లాక్ చేసిన హీరో కింగ్ నాగార్జున.

షూటింగ్ జరుగుతుండగానే సంక్రాంతి రిలీజ్ అంటూ క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్.. రిలీజ్ డేట్‌ను ఫైనల్ చేసేందుకు మాత్రం చాలా టైమ్ తీసుకుంది.

ఫైనల్‌గా జనవరి 14 రిలీజ్ అంటూ క్లారిటీ ఇవ్వటంతో బరిలో కింగ్ ఎంట్రీ కన్ఫార్మ్ అయిపోయింది. ఆల్రెడీ పొంగల్ సీజన్ ఫుల్ బిజీగా ఉన్నా.. ఏ మాత్రం ఆలోచించకుండా పోటికి సై అంటున్నారు నాగ్.

అందుకు మెయిన్ రీజన్, ఈ సీజన్‌లో నాగ్ రికార్డ్సే. గతంలో సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు లాంటి సినిమాలతో సంక్రాంతి సీజన్‌లో బిగ్ హిట్స్ అందుకున్నారు నాగ్.

అందుకే ఆ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ ఈ సారి కూడా పొంగల్ సీజన్‌ను టార్గెట్ చేస్తున్నారు. నా సామిరంగ సినిమాతో పాటు బిగ్‌బాస్ షూటింగ్‌ను కూడా ప్యారలల్‌గా కంటిన్యూ చేశారు నాగ్. దీంతో సినిమా షూటింగ్ ఆలస్యమైంది.

ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నా.. ఏ మాత్రం ఆలోచించకుండా రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది యూనిట్. ఏది ఏమైనా సంక్రాంతి సెంటిమెంట్‌ను మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతోనే నాగ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ నాగ్‌కు వర్క్అవుట్ అవుతుందేమో చూడాలి.





























