- Telugu News Photo Gallery Cinema photos Star Heroines Pooja Hegde and Krithi Shetty looking for a hit in their next movies
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క హిట్ ప్లీజ్.. అంటున్న స్టార్ హీరోయిన్స్..
యాక్టివ్, బీ యాక్టివ్... ఇంత నెమ్మదిగా ఉంటే కుదరదు. గట్టిగా ప్లాన్ చేయండి. బొమ్మ అదిరిపోవాలి. బాక్సాఫీస్ బద్ధలైపోవాలి. అమ్మాయి అదుర్స్ అనిపించాలి... అంటూ ఎవరో చెప్పే మోటివేషనల్ క్లాసెస్ వింటున్నారా... ఆ ఇద్దరు హీరోయిన్లు..? ఎవరు వారు అంటున్నారా? ఇంకెవరూ... పూజా అండ్ కృతి... ఇప్పుడెక్కడున్నారు? ఏం చేయబోతున్నారు? కమాన్ లెట్స్ వాచ్... పూజా హెగ్డేని పలకరించిన వరుస ఆఫర్లు చూసి ఇంకో దశాబ్దాం పాటు ఈ అమ్మాయికి తిరుగులేదు అనుకున్నారంతా.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Jan 10, 2024 | 5:26 PM

యాక్టివ్, బీ యాక్టివ్... ఇంత నెమ్మదిగా ఉంటే కుదరదు. గట్టిగా ప్లాన్ చేయండి. బొమ్మ అదిరిపోవాలి. బాక్సాఫీస్ బద్ధలైపోవాలి. అమ్మాయి అదుర్స్ అనిపించాలి... అంటూ ఎవరో చెప్పే మోటివేషనల్ క్లాసెస్ వింటున్నారా... ఆ ఇద్దరు హీరోయిన్లు..? ఎవరు వారు అంటున్నారా? ఇంకెవరూ... పూజా అండ్ కృతి... ఇప్పుడెక్కడున్నారు? ఏం చేయబోతున్నారు? కమాన్ లెట్స్ వాచ్...

పూజా హెగ్డేని పలకరించిన వరుస ఆఫర్లు చూసి ఇంకో దశాబ్దాం పాటు ఈ అమ్మాయికి తిరుగులేదు అనుకున్నారంతా. కానీ, ఎక్కడ మిస్‌ఫైర్ అయిందోగానీ 2023లో ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయారు ఈ బ్యూటీ.

అల వైకుంఠపురం, అరవింద సమేత అంటూ ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు పూజా హెగ్డే. మళ్లీ అలాంటి గోల్డెన్ డేస్‌ని ఎంజాయ్ చేయాలి మీరు అంటూ చీరప్ చేస్తున్నారు బుట్టబొమ్మ ఫ్యాన్స్. మీరు కాస్త ప్లాన్ చేసుకోండి... మేం మీ వెంటే ఉన్నాం అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు.

పూజా హెగ్డేకి ఉన్నంత క్రేజే, కాస్త అటూ ఇటూగా కృతి శెట్టి విషయంలోనూ కనిపించింది. ఉప్పెన సినిమాలో ముద్దుముద్దుగా కృతి చెప్పిన డైలాగులకు ఒక్కసారిగా ఫిదా అయింది తెలుగు యూత్. అయితే ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌ని నిలబెట్టుకోలేకపోయారు కృతి శెట్టి.

తన వద్దకు వచ్చిన సినిమాల్లో బాగానే యాక్ట్ చేసినా, డ్యాన్స్ చేసినా ఉపయోగం లేకపోయింది కృతి శెట్టికి. సినిమాలు క్లిక్ కాకపోవడంతో కృతి కిట్టీ కాస్త ఖాళీగానే కనిపిస్తోంది. అదర్ లాంగ్వేజెస్ మీద ఫోకస్‌పెట్టిన ఈ బ్యూటీ తెలుగులో పర్ఫెక్ట్ స్క్రిప్టులతో ఎప్పుడు పలకరిస్తారు అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.





























