- Telugu News Photo Gallery Cinema photos Rajinikanth doing movie shootings in same speed as young heroes like Jailer, Lal Salaam
కుర్రహీరోలతో పోటీపడుతున్నారు తలైవ.. ఆయన స్పీడ్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్న కుర్ర హీరోలు
కుర్రహీరోలతో పోటీపడుతున్నారు తలైవర్. ఒకటా, రెండా, అంటే... అంతకు మించి అంటూ స్టైల్‌గా నవ్వుతున్నారు రజనీ. మొన్నీమధ్య జైలర్ సక్సెస్ నుంచి బయటకు రాకముందే ఇంకో మూడు సినిమాలను లైన్లో పెట్టేశారు సూపర్‌స్టార్. ఆయన స్పీడ్ అందుకుంటే చాలంటూ టార్గెట్ ఫిక్స్ చేసుకుంటున్నారు యంగ్‌స్టర్స్. రజనీకాంత్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్‌స్పయిరింగ్‌గా ఉందంటూ జైలర్ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Jan 10, 2024 | 5:45 PM

కుర్రహీరోలతో పోటీపడుతున్నారు తలైవర్. ఒకటా, రెండా, అంటే... అంతకు మించి అంటూ స్టైల్‌గా నవ్వుతున్నారు రజనీ. మొన్నీమధ్య జైలర్ సక్సెస్ నుంచి బయటకు రాకముందే ఇంకో మూడు సినిమాలను లైన్లో పెట్టేశారు సూపర్‌స్టార్. ఆయన స్పీడ్ అందుకుంటే చాలంటూ టార్గెట్ ఫిక్స్ చేసుకుంటున్నారు యంగ్‌స్టర్స్.

రజనీకాంత్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్‌స్పయిరింగ్‌గా ఉందంటూ జైలర్ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ఇలాంటి స్క్రిప్ట్ లు రావాలి, వాటిని స్టార్లు సెలక్ట్ చేసుకోవాలీ, మేం ఆస్వాదించాలి అంటూ సినిమాను సక్సెస్ చేశారు ఫ్యాన్స్. జైలర్‌లో రజనీకాంత్ నెవర్ బిఫోర్ అవతార్‌లో మెస్మరైజ్ చేశారంటూ ఇండస్ట్రీ అంతా మెచ్చుకుంది.

జైలర్ సక్సెస్ జోష్‌లో ఉండగానే కూతురు ఐశ్వర్య డైరక్షన్‌లో లాల్ సలామ్ కంప్లీట్ చేశారు తలైవర్. ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉంది. పొంగల్ సీజన్‌ని, మిస్ కావడానికి అంతగా ఇష్టపడరు రజనీకాంత్. ఈ సంక్రాంతికి తాను గెస్ట్ అప్పియరెన్సే ఇచ్చినా, లాల్ సలామ్ మీద హోప్స్ పెట్టుకోవచ్చని సిగ్నల్స్ పంపిస్తున్నారు రజనీ.

లాల్ సలామ్ షూటింగ్ పూర్తికాగానే జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ డైరక్షన్‌లో వేట్టయన్ సినిమా చేస్తున్నారు రజనీకాంత్. ప్రస్తుతం యమా స్పీడ్‌గా షూటింగ్ జరుపుకుంటోంది వేట్టయన్. రజనీకాంత్ లుక్ కొత్తగా ఉందంటూ అప్పుడే కాంప్లిమెంట్స్ కూడా అందుతున్నాయి.

వేట్టయన్ షూటింగ్ పూర్తి కాగానే లోకేష్ కనగరాజ్ సెట్లో మేకప్ వేసుకుంటారు రజనీ. లియో తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్ మీదే పనిచేస్తున్నారు లోకేష్. ఆ తర్వాత టైమ్ వేస్ట్ చేయకుండా మారి సెల్వరాజ్‌కి ఓకే చెప్పేశారు రజనీకాంత్. కల్ట్ మూవీస్ తీయడంలో మారి సెల్వరాజ్‌కి స్పెషల్ ఇమేజ్ ఉంది. రీసెంట్‌గా మామన్నన్ రిలీజ్ అయినప్పుడు మారిని పిలిచి ప్రశంసించారు రజనీ. ఆ తర్వాతే ఈ స్క్రిప్టు ఫైనల్ చేశారని సమాచారం.





























