Indian 2: ప్రమోషన్స్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన ఇండియన్ 2 టీం
ఇండియన్ 2.. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు కమల్ హాసన్ కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా షూటింగ్ ఫినిష్ చేసిన యూనిట్ ఇప్పుడు ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టింది. త్వరలో పక్కా ప్లానింగ్‌తో జనాల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. కమల్ హాసన్ స్వతంత్ర్య సమరయోధుడిగా, కరప్ట్ గవర్నమెంట్ ఆఫీసర్‌గా ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇండియన్. ఈ మూవీ నేషనల్ లెవల్‌లో సూపర్ హిట్ అయ్యింది. భారతీయుడు పేరుతో తెలుగులో కూడా సంచలనం సృష్టించింది. దీంతో అప్పట్లోనే ఇండియన్‌కు సీక్వెల్ ఉంటుందన్న హింట్ ఇచ్చారు మేకర్స్.