Rocking Star Yash: ఈసారి కూడా అదే ఫార్ములా.! ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లిన రాకీభాయ్.
రీసెంట్ అప్‌కమింగ్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు రాకీభాయ్ యష్. టాక్సిక్ పేరుతో పాన్ ఇండియా మూవీ ఎనౌన్స్ చేసిన యష్ వెంటనే సైలెంట్ అయ్యారు. మరి బర్త్ డే రోజైనా ఫ్యాన్స్‌కు నెక్ట్స్ అప్‌డేట్ ఇస్తారా..? లేదంటే ఈ సైలెన్స్ ఇలాగే మెయిన్‌టైన్ చేస్తారా..? కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు కన్నడ హీరో యష్. ఈ ఒక్క సినిమా యష్ ఇమేజ్‌ను తారా స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా తరువాత యష్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.