డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ జోడిగా మీనాక్షి చౌదరీ, శ్రీలీల కథానాయికలుగా నటించగా.. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈరోజు సాయంత్రం గుంటూరులో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రోడ్యూసర్ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హజరయ్యారు.