- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan says his OG movie will released after AP Elections
OG: అన్నీ ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటున్న పవన్.. సందిగ్ధం లో ఫ్యాన్స్
పవన్ కళ్యాణ్ సినిమాలపై ఎలాంటి అప్‌డేట్స్ రావని అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఆయన ఉన్న పొలిటికల్ బిజీ కారణంగా.. అవి ఆశించడం కూడా తప్పే అని వాళ్లకు తెలుసు. కానీ ఇలాంటి సమయంలో OG నుంచి అనుకోకుండా ఓ అప్‌డేట్ వచ్చింది.. అది చూసాక ఫ్యాన్స్ పండగ కామన్ కదా మరి. ఇంతకీ ఏంటా అప్‌డేట్.. దాని సారాశమేంటి.. ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఏపీలో మరో మూడు నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో.. ఆయన నుంచి సినిమా అప్‌డేట్స్ ఊహించడం కూడా అత్యాశే.
Updated on: Jan 09, 2024 | 7:23 PM

పవన్ కళ్యాణ్ సినిమాలపై ఎలాంటి అప్‌డేట్స్ రావని అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఆయన ఉన్న పొలిటికల్ బిజీ కారణంగా.. అవి ఆశించడం కూడా తప్పే అని వాళ్లకు తెలుసు. కానీ ఇలాంటి సమయంలో OG నుంచి అనుకోకుండా ఓ అప్‌డేట్ వచ్చింది.. అది చూసాక ఫ్యాన్స్ పండగ కామన్ కదా మరి. ఇంతకీ ఏంటా అప్‌డేట్.. దాని సారాశమేంటి.. ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఏపీలో మరో మూడు నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో.. ఆయన నుంచి సినిమా అప్‌డేట్స్ ఊహించడం కూడా అత్యాశే. అందుకే హరీష్ శంకర్, క్రిష్ లాంటి దర్శకులు ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోయారు. అయితే సుజీత్ ఒక్కడే ఓజిని అంటి పెట్టుకుని ఉన్నారు. ఈ సినిమాపైనే వర్క్ చేస్తున్నారీయన.

పవన్ పొలిటికల్ బిజీ కారణంగా ఓజి షూటింగ్ ప్రస్తుతానికి ఆపేసాం అంటూ ఈ మధ్యే ట్వీట్ చేసారు డివివి ఎంటర్‌టైన్మెంట్స్. అయితే ఈ చిత్రం చేతులు మారింది.. మరో నిర్మాణ సంస్థ తీసుకుందంటూ సడన్‌గా సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. దాంతో ఫ్యాన్స్‌లో కామన్‌గానే కంగారొచ్చేసింది.. వెంటనే ప్రొడక్షన్ రంగంలోకి దిగి అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చింది.

OG మాదే.. ఎప్పటికీ మాదే.. కొంత ఆలస్యమైనా సరే ఆకలి తీర్చుకోవడం కోసం చీతా రావడం ఖాయమని డివివి సంస్థ అఫీషియల్‌గా పోస్ట్ చేసారు. హరిహర వీరమల్లు లేట్ అవ్వడంతో బజ్ ముందులా లేదు.. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్.. దాంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిటైన సినిమాల్లో ఓజిపైనే అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఇది పవన్ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా.

ఓజిలో గ్యాంగ్ స్టర్‌గా నటిస్తున్నారు పవన్. ఇప్పటికే షూటింగ్ 80 శాతం పూర్తైంది. ఏపీ ఎన్నికల తర్వాత ఓజి సెట్‌లో పవన్ అడుగు పెట్టనున్నారు. అప్పటి వరకు ఎదురు చూపులైతే తప్పవు. అయితే నెక్ట్స్ షెడ్యూల్స్ కోసం ఇప్పట్నుంచే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు సుజీత్. ఏదేమైనా ఆఫ్టర్ ఎలక్షన్స్ పవన్ నుంచి వచ్చే మొదటి సినిమా మాత్రం ఓజినే.




