Singer Sunitha: ఓటీటీలోకి సునీత కుమారుడి సినిమా.. ‘సర్కారు నౌకరి’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Sarkaru Naukari OTT: టాలీవుడ్ ఫేమస్‌ సింగ‌ర్ సునీత కుమారుడు త‌న‌యుడు ఆకాశ్ గోప‌రాజు వెండితెరకు పరిచయమయ్యాడు. సర్కారీ నౌకరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. డిఫరెంట్‌ టైటిల్, వైవిధ్యమైన కథ, కథనాలతో మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు ఆకాశ్‌ గోపరాజు. నూతన సంవత్సరం కానుకగా ఈ ఏడాది జనవరి 1న థియేటర్లలో విడుదలైన సర్కారు నౌకరికి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

Singer Sunitha: ఓటీటీలోకి సునీత కుమారుడి సినిమా.. 'సర్కారు నౌకరి' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sarkaru Naukari Movie
Follow us

|

Updated on: Jan 10, 2024 | 2:01 PM

టాలీవుడ్ ఫేమస్‌ సింగ‌ర్ సునీత కుమారుడు త‌న‌యుడు ఆకాశ్ గోప‌రాజు వెండితెరకు పరిచయమయ్యాడు. సర్కారీ నౌకరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. డిఫరెంట్‌ టైటిల్, వైవిధ్యమైన కథ, కథనాలతో మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు ఆకాశ్‌ గోపరాజు. నూతన సంవత్సరం కానుకగా ఈ ఏడాది జనవరి 1న థియేటర్లలో విడుదలైన సర్కారు నౌకరికి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. సామాజిక సందేశానికి కాస్త కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను జోడించి గంగనమోని శేఖర్‌ ఈ మూవీని తెరకెక్కించాడు. ఆర్‌కే టెలిషో ప‌తాకంపై దర్శకేంద్రుడు రాఘ‌వేంద్రరావు సర్కారు నౌకరి సినిమాను నిర్మించడం విశేషం. ఈ సినిమాతోనే భావ‌న హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇందులో త‌నికెళ్ల భరణి, మ‌ధుల‌త‌, మ‌హ‌దేవ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎయిడ్స్‌, కండోమ్‌లపై అవగాహన కల్పిస్తూ రూపొందిన ఈ సినిమాలో ఆకాశ్ గోప‌రాజు నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆకట్టుకున్న సర్కారు నౌకరి సినిమా ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఆకాశ్‌ గోపరాజు సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో గణతంత్ర దినోత్సవం కారణంగా జనవరి 26 నుంచి సర్కారు నౌకరి సినిమాను డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే థియేటర్లలో రిలీజైన 20 రోజులకే వచ్చేస్తుందన్నమాట.

స‌ర్కారు నౌక‌రి సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఉద్యోగం చేస్తుంటాడు గోపాల్‌ (ఆకాశ్‌ గోపరాజు). కండోమ్స్‌ పంచే జాబ్‌ చేసే అతనికి సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి? ప్రేమించి పెళ్లి చేసుకున్న సత్య (భావన) కూడా అతనికి ఎందుకు దూరమైంది? అన్నది ఎంతో హృద్యంగా తెరకెక్కించాడు డైరెక్టర్‌. అయితే సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడంతో సినిమా పెద్దగా అంచనాలను అందుకోలేకపోయింది. మరి ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సర్కారు నౌకరి సినిమాను థియేటర్లలో మిస్‌ అయ్యారా? అయితే ఓటీటీ రిలీజ్‌ డేట్ కోసం వేచి చూద్దాం.

ఇవి కూడా చదవండి

This new year is going to be the most special one 🙂

Duty begins in theatres on 01.01.2024 🤎#SarkaaruNoukari @Ragavendraraoba @ShekarPhotos @BVazhapandal #SandilyaPisapati @OfficialSunitha @MangoMusicLabel pic.twitter.com/lp7aw2XJPG

— Akash Goparaju (@AkashGoparaju98) December 15, 2023

సర్కారు నౌకరి ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు