AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor: వెరైటీ కాన్సెప్ట్‌తో సినిమాలు.. సౌతిండియాలో సూపర్‌ క్రేజ్‌.. ఈ స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టారా?

పై ఫొటోలో ఉన్న హీరోను గుర్తు పట్టారా? ఎవరికీ తోచని వెరైటీ కాన్సెప్ట్‌లు, సరికొత్త సబ్జెక్టులతో సినిమాలు చేయడంలో ఈ స్టార్‌ హీరో దిట్ట. ఆయన, ఆయన తీసే సినిమాలకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. కేవలం యాక్టింగ్ లోనే కాదు డైరెక్షన్ లోనూ దుమ్ము దులుపుతాడు. ఇటీవలే పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. మరోసారి నేషనల్ లెవెల్ లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు.

Actor: వెరైటీ కాన్సెప్ట్‌తో సినిమాలు.. సౌతిండియాలో సూపర్‌ క్రేజ్‌.. ఈ స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టారా?
Actor
Basha Shek
|

Updated on: Jan 08, 2024 | 10:25 PM

Share

ఇప్పుడంటే డైరెక్షన్ జోలికి పోకుండా… హీరోగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కానీ.. ఒకప్పుడు మాత్రం ఉపేంద్ర సినిమాలే వేరు. ఆయన స్టోరీ సెలక్షన్.. టేకింగ్‌.. స్టోరీ నరేష్‌.. రూటే సపరేటు. ఒక్క మాటలో చెప్పాలంటే కల్టు.! అందుకే ఆయన సినిమాలకు.. ఆయకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన అలాంటి సినిమాలు చేస్తే చూడాలనే ఓ వర్గం కూడా ఉంది. కానీ ఆయన మాత్రం సినిమాలను డైరెక్ట్ చేయడం తగ్గించారు. హీరోగా బిజీ అయ్యారు. ఇక ఇలాంటి క్రమంలోనే తాజాగా తన స్టైల్లో ఓ మూవీ మొదలెట్టారు అదే ‘యూ ఐ’. జస్ట్ అనౌన్స్‌మెంట్‌తోనే అందర్లో తెలియని క్యూరియాసిటీని కలిగించిన ఈ మూవీ.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీ నుంచి రీసెంట్‌ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ వీడియో.. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. this is mot AI world.. this is UI world అంటూ.. వీఎఫ్‌ఎక్స్‌ విజువల్‌తో మొదలైన ఈ వీడియో గ్లింప్స్.. చాలా వైల్డ్‌గా… కాస్త కొత్తగా.. విచిత్ర మనుషుల మధ్యగా సాగుతూ… ఎట్టకేలకు గుర్రం మీద వచ్చిన ఉపేంద్ర లుక్‌తో.. ఎండ్‌ అవుతుంది. ఉపేంద్ర డిఫరెంట్ లుక్‌… అందుకు తగ్గట్టు.. ఉపేంద్ర చుట్టూ ఉన్న మనుషులు.. ఆ మనుషులు ఉన్న లోకం చూస్తుంటే.. ఇదో మార్క్‌ డిఫరెంట్ సబ్జెక్ట్ లా అనిపిస్తుంది. తెలియని ఇంట్రెస్ట్‌ ను బిల్డ్‌ చేస్తూనే.. సినిమా పై క్యూరియాసిటీని పెంచుతోంది. ఉపేంద్ర ఫ్యాన్స్‌ స్టైల్లో చెప్పాలంటే.. పిచ్చెక్కిస్తోంది.

తాజాగా ఉపేంద్ర యూఐ సినిమా టీజర్‌ను శివరాజ్‌కుమార్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ఈ టీజర్ కళ్లు చెదిరేలా ఉందంటూ కిచ్చా సుదీప్ కూడా ట్విట్టర్‌ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ఉపేంద్ర గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్‌ పట్టుకున్నారు. దీంతో యూఐ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ‘యుఐ’ని జి మనోహరన్, కెపి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. కాంతార, విరూపాక్ష, మంగళ వారం సినిమాలకు సంగీతం అందించిన బి. అజనీష్ లోక్‌నాథ్ యూఐ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.