- Telugu News Photo Gallery Cinema photos Actress Surekha Vani Offers Her Hair At Tirumala Tirupati Srivari Temple
Surekha Vani: తిరుమల శ్రీవారి సేవలో సురేఖా వాణి.. తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న నటి.. ఫొటోస్
ప్రముఖ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. కూతురు సుప్రియతో కలిసి కాలినడకన తిరుమల చేరుకున్న ఆమె ఆదివారం (జనవరి 07) ఏడు కొండల స్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకుందీ సీనియర్ నటీమణి.
Updated on: Jan 07, 2024 | 6:46 PM

ప్రముఖ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. కూతురు సుప్రియతో కలిసి కాలినడకన తిరుమల చేరుకున్న ఆమె ఆదివారం (జనవరి 07) ఏడు కొండల స్వామిని దర్శించుకున్నారు.

అంతకు ముందు తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకుందీ సీనియర్ నటీమణి. ఈ సందర్భంగా దర్శనానంతరం సురేఖా వాణితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

ప్రస్తుతం సురేఖ వాణి తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఇన్ని రోజుల పాటు గ్లామరస్ లుక్‌లో కనిపించిన సురేఖ వాణి సడెన్‌గా గుండుతో కనిపించడంతో చాలా మంది షాక్ అవుతున్నారు.

కాగా సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్క పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు సురేఖా వాణి. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.

కూతురు సుప్రితతో కలిసి సురేఖ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన వస్తుంటుంది. ఇక కూతురు సుప్రితను కూడా సినిమాల్లోకి తీసుకురావాలనే యోచనలో సురేఖ ఉన్నట్లు తెలుస్తోంది.




